‘నెపోటిజం’పై రానా స్పందన

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తరువాత సినిమా ఇండస్ట్రీలో నెపోటిజంపై గట్టిగానే మండిపడ్డారు నెటిజన్లు. ఆ సమయంలో బంధుప్రీతిపై బాగా చర్చ జరిగింది. బాలీవుడ్ తారలను ఏకిపారేశారు. అయితే టాలీవుడ్ లోనూ బంధుప్రీతి ఉందంటూ కొందరు రచ్చ చేశారు. పైగా ఇండస్ట్రీని నాలుగు కుటుంబాలే ఏలుతున్నాయని, బయట వారికి అవకాశాలు ఇవ్వట్లేదని, ట్యాలెంట్ ఉన్నవారిని తొక్కేస్తున్నారని అన్నారు. ఈ విషయంపై ఒక్కొక్కరు ఒక్కో రకంగా స్పందించారు. తాజాగా సెలెబ్రిటీ కుటుంబం నుంచి వచ్చిన టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి బంధుప్రీతిపై తన అభిప్రాయాన్ని పంచుకున్నారు.

Read Also : కాళ్ళు పట్టుకున్నావ్… ప్రకాష్ రాజ్ పై విరుచుకు పడ్డ మంచు విష్ణు

ఓ నేషనల్ మీడియాకు ఇటీవల ఇచ్చిన ఇంటర్వ్యూలో రానా మాట్లాడుతూ “నిర్వచనం ప్రకారం నెపోటిజం అంటే రాజకీయ రంగంలో లేదా ప్రభుత్వ రంగ సంస్థలకు వర్తిస్తుంది. వినోద ప్రపంచం కళలపై ఆధారపడి ఉంటుంది. దీనికి ప్రముఖ కుటుంబానికి చెందినవారా? లేదా అనే తేడా ఉండదు. ట్యాలెంట్ ను ఎవరు ఎంత కృషి చేస్తున్నారు ? అనేదే అవసరం. ట్యాలెంట్ ఉంటే ఎవరూ ఆపలేరు” అని అన్నారు.

రానా ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పుడు ఆయనకు ఫ్యామిలీ నుంచి మంచి సపోర్ట్ ఉంది. కానీ ఆయన ఇండస్ట్రీలో గట్టిగానే కష్టపడాల్సి వచ్చింది. మొత్తానికి ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరుచుకున్నాడు. ప్రస్తుతం ఆయన దేశంలోని ప్రముఖ నటులలో ఒకరు. ఎలాంటి పాత్రను పోషించడానికైనా ఆయన వెనకాడరు. ప్రస్తుతం రానా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ‘భీమ్లా నాయక్’ చిత్రంలో నటిస్తున్నాడు. సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రం మలయాళ హిట్ చిత్రం ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ అధికారిక రీమేక్. మరో వైపు నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి ‘రానా నాయుడు’ అనే కొత్త వెబ్ సిరీస్‌ చేయబోతున్నట్లు ప్రకటించాడు.

-Advertisement-'నెపోటిజం'పై రానా స్పందన

Related Articles

Latest Articles