మరో మల్టీస్టారర్ కు సిద్ధమైన రానా

టాలీవుడ్ హల్క్ రానా దగ్గుబాటి మరో మల్టీస్టారర్ కు సిద్ధం అయ్యాడు. ఇప్పటికే నెట్ ఫ్లిక్స్ కోసం బాబాయ్ వెంకటేష్ తో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నారు రానా. అయితే మరో యంగ్ హీరోతో స్క్రీన్ స్పేస్ ను పంచుకోవడానికి రానా సిద్దమయ్యాడు. మరో టాలెంటెడ్ హీరో శర్వానంద్, రానా కాంబినేషన్ లో క్రేజీ మల్టీస్టారర్ రూపొందనుంది అనే వార్త గత రెండు రోజులుగా చక్కర్లు కొడుతోంది. అగ్ర నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ నిర్మించనున్న ఈ సినిమాతో కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం కానున్నాడట. ఆ యంగ్ డైరెక్టర్ చెప్పిన స్క్రిప్ట్‌ను ఇద్దరు స్టార్స్ ఇష్టపడ్డారట. వీరిద్దరూ వారి ప్రస్తుత ప్రాజెక్టులను పూర్తి చేసిన తర్వాత ఈ ప్రాజెక్ట్ తెరకెక్కనుంది. ఈ ప్రాజెక్ట్ పై త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది.

Read Also : షాకింగ్ : టాలీవుడ్ నటి ఆత్మహత్య

మరోవైపు రానా దగ్గుబాటి ‘విరాట పర్వం’ చిత్రీకరణ పూర్తయింది. త్వరలో ఈ సినిమా విడుదలవుతుంది. ప్రస్తుతం రానా వచ్చే ఏడాది విడుదల కానున్న పవన్ కళ్యాణ్ ‘భీమ్లా నాయక్’ షూటింగ్ చేస్తున్నాడు. మరోవైపు శర్వానంద్ “మహా సముద్రం” చిత్రీకరణను పూర్తి చేసాడు. ఈ చిత్రం దసరాకు విడుదల కానుంది. ఇప్పుడు కిశోర్ తిరుమల దర్శకత్వంలో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది థియేట్రికల్‌గా విడుదల కానుంది. ఈ సంవత్సరం డిసెంబర్ నుండి రానా సినిమా షూటింగ్ ప్రారంభిస్తాడు. శర్వానంద్ కూడా రాజు సుందరం దర్శకత్వం వహిస్తున్న ఒక సినిమాకి సంతకం చేసాడు. అది వచ్చే ఏడాది విడుదల కానుంది.

-Advertisement-మరో మల్టీస్టారర్ కు సిద్ధమైన రానా

Related Articles

Latest Articles