అతడి వలనే సమంతకు హాలీవుడ్ ఆఫర్ వచ్చిందా..?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారింది. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లలో పలు ప్రాజెక్టులు చేస్తున్న అమ్మడు తాజాగా హాలీవుడ్ కి కూడా పయనమైన సంగతి తెలిసిందే. ‘ ది అరేంజ్మెంట్స్ ఆఫ్ లవ్‘ చిత్రంతో సామ్ హాలీవుడ్ లో అడుగుపెట్టబోతుంది. హాలీవుడ్ డైరెక్టర్ ఫిలిప్ జాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని గురు ఫిలింస్ పతాకంపై సునీత తాటి నిర్మిస్తున్నారు. ఇక ఈ ఆఫర్ వచ్చినప్పటినుంచి.. సామ్ వెనుక ఉన్న హాలీవుడ్ షాడో ఎవరు అని ప్రశ్నలు మొదలయ్యాయి.

ఇంతటి అవకాశం రావడానికి గల వ్యక్తి ఎవరు..? అంటే రానా దగ్గుబాటి అని అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. సునీత తాటి ఈ కథ విన్నవెంటనే రానాకు చెప్పగా.. ఈ హీరో సామ్ ని కలవమని చెప్పారట.. ఆ తరువాత సునీత, సామ్ ని కలవడం, ఆమెకు కథ నచ్చి ఓకే చెప్పడం వెంటవెంటనే జరిగిపోయాయి అంట.. అలా చూసుకుంటే సమంతను సునీతను కలిపిన షాడో హీరో రానా దగ్గుబాటియేగా మరి.. ఇకపోతే ఈ చిత్రంలో సామ్ బై సెక్సువల్ వుమెన్ గా కనిపించబోతుంది. అంతేకాకుండా ఒక డిటెక్టీవ్ పాత్రలో కూడా మెరవనున్నదట. మరి ఇందులో నిజమెంత ఉందో తెలియాలంటే కొన్ని రోజులు ఆగాల్సిందే.

Related Articles

Latest Articles