షాకింగ్: మెగాస్టార్ సోదరిగా రమ్యకృష్ణ..?

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలను చేస్తూ యంగ్ హీరోలకు పోటీ ఇస్తున్నారు. వరుసగా మూడు సినిమాలను లైన్లో పెట్టిన చిరు ప్రస్తుతం ‘గాడ్‌ఫాదర్’ షూటింగ్ లో పాల్గొంటున్నారు. తమిళ డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం ప్రముఖ మలయాళ చిత్రం ‘లూసిఫర్’ రీమేక్ గా తెరకెక్కుతుంది. ఇక ఈ చిత్రంలో మెగాస్టార్ చిరంజీవి చెల్లెలిగా ఎవరు కనిపించబోతున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. ఒరిజనల్ వెర్షన్ లో మోహన్ లాల్ చెల్లెలిగా మంజు వారియర్ సందడి చేసింది.

ఇక తెలుగులో చిరు చెల్లెలిగా నయనతార నటిస్తుందని వార్తలు గుప్పుమన్నాయి.. ఆ తరువాత నయన్ ప్లేస్ ని శోభన రీప్లేస్ చేసిందని అన్నారు. అయితే తాజాగా వీరిద్దరూ కాకుండా సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ ఆ పాత్రలో మెరవబోతుందని సమాచారం.. 90 లో రొమాంటిక్ కపుల్స్ గా పేరు తెచ్చుకున్న జంట చిరు- రమ్యకృష్ణ. ఇప్పటికి కూడా వారిద్దరూ పార్టీల్లో, వేడుకలో కలిసినప్పుడు వారి బాండింగ్ కూడా అలానే ఉంటుంది. కానీ, ఇప్పుడు ఈ చిత్రంలో చిరు చెల్లెలిగా చేయడానికి రమ్యకృష్ణ ఎలా ఒప్పుకున్నది అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు.మరి ఈ వార్తలో నిజమెంత అనేది తెలియాలంటే మేకర్స్ అధికారికంగా ప్రకటించాల్సిందే.

Related Articles

Latest Articles