రామప్ప దేవాలయానికి యునెస్కో గుర్తింపు

వరంగల్‌ రామప్ప దేవాలయానికి అంతర్జాతీయ గుర్తింపు లభించింది. ములుగు జిల్లాలోని రామప్ప ఆలయాన్ని ప్రపంచ వారసత్వ స్థలంగా యునెస్కో గుర్తించింది. వారసత్వ కట్టడాల విశిష్టతల పరిశీలన కోసం చైనాలోని ఫ్యూజులో వర్చువల్‌ గా సమావేశమైన ప్రపంచ హెరిటేజ్‌ కమిటీ ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 42 వారసత్వ కట్టడాలు యునెస్కో పరిశీలనకు ఎంపిక కాగా.. ఇండియా నుంచి 2020 ఏడాదికి రామప్పకు మాత్రమే ఈ స్థానం దక్కింది. రామప్పకు అంతర్జాతీ గుర్తింపు రావడంపై ప్రధాని మోడీ హర్షం వ్యక్తం చేశారు. కాకతీయుల శిల్పకళా వైభవానికి ప్రతీక రామప్ప ఆలయం అని మోడీ కొనియాడారు.

Related Articles

-Advertisement-

Latest Articles

-Advertisement-