రైతులకు కేసీఆర్ చేసిందేమీ లేదు: రామచందర్ రావు

రైతులకు కేసీఆర్‌ చేసిందేమి లేదని బీజేపీ సీనియర్‌ నేత రామచందర్‌ రావు అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టీఆర్ఎస్‌పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. కాళేశ్వరం ద్వారా ఎన్ని ఎకరాలకు నీళ్లు ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన అన్నారు. తెలంగాణ వ్యవసాయ రంగానికి కేంద్రం ఇచ్చిన నిధులపై చర్చకు బీజేపీ సిద్ధం మీరు సిద్ధమేనా అంటూ సవాల్‌ విసిరారు. టీఆర్ఎస్, కాంగ్రెస్ , సీపీఎం, సీపీఐ పార్టీలు వేర్వేరు కాదన్నారు. అన్ని ఒక్కటే దారిలో నడుస్తాయని ఎద్దేవా చేశారు. రైతు బంధు తీసుకుంటున్న వారిలో టీఆర్ఎస్‌కు చెందిన ప్రజా ప్రతినిధులే అధిక సంఖ్యలో ఉన్నారన్నారు.

Read Also: HRA , CCA, ఇతర సౌకర్యాలను యథాతథంగా కొనసాగించాలి: ఏపీ ఉద్యోగ సంఘాలు

అంతా బావుంటే తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయో చెప్పాలని రామచందర్‌ రావు డిమాండ్‌ చేశారు. తెలంగాణలో విద్యుత్‌ ఎంత ఉత్పత్తి చేస్తున్నారో చెప్పాలి? 20రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాలు క్వాలిటీ విద్యుత్ ఇస్తున్నాయని రామచందర్‌ రావు అన్నారు. కేసీఆర్ నీళ్లు ఇస్తే.. రైతులు 23లక్షల బోర్లు ఎందుకు ఉపయోగిస్తున్నారో సమాధానం చెప్పాలన్నారు. తెలంగాణలో గ్రౌండ్‌ వాటర్‌ పెరగాడానికి కేంద్ర ప్రభుత్వ నిధులే కారణమని ఆయన తేల్చి చెప్పారు. పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, మల్లారెడ్డిలాంటి వాళ్లకు అసలు రైతుం బంధుకు ఎందుకు అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని రామచందర్‌ రావు ప్రశ్నించారు.

Related Articles

Latest Articles