మరో కోలీవుడ్ ‘ఇస్మార్ట్’ డైరెక్టర్ తో … రామ్ పోతినేని!

కెరీర్ మొదట్నుంచీ లవ్వర్ బాయ్ పాత్రలు, రొమాంటిక్ ఎంటర్టైనర్స్ అందించాడు రామ్ పోతినేని. కానీ, పూరీ జగన్నాథ్ ‘ఇస్మార్ట్ శంకర్’ పెద్ద టర్నింగ్ పాయింట్ తీసుకొచ్చింది. ఇప్పుడాయన ఎంపిక పూర్తిగా మారిపోయింది. వెరైటీ చిత్రాలు, వేరు వేరు దర్శకులు అన్నట్టుగా సాగుతున్నాడు రామ్. మరీ ముఖ్యంగా, తమిళ దర్శకుల మీద స్పెషల్ కాన్సన్ట్రేషన్ పెట్టాడు.

రామ్ నెక్ట్స్ మూవీ కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో చేస్తున్నాడు. అదొక అల్ట్రా మాస్ మూవీ అంటూ ప్రచారం జరుగుతోంది. ఒకేసారి తెలుగు జనాన్ని, తమిళ ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలా ఉంటుందట. కన్నడ భామ, ‘ఉప్పెన’ సుందరి కృతీ శెట్టి లింగుస్వామి మూవీలో రామ్ తో రొమాన్స్ చేయునుంది. అయితే, తన నెక్ట్స్ మూవీనే కాదు… ఆ తరువాతి చిత్రం కూడా కోలీవుడ్ డైరెక్టర్ కే అప్పజెప్పాలని ఎనర్జిటిక్ స్టార్ ఆలోచిస్తున్నాడట.

చెన్నైలో స్టార్ హీరోల డైరెక్టర్ గా మురుగదాస్ కి మంచి పేరుంది. ఆయన సినిమాలకి తెలుగులోనూ కొంత డిమాండ్ ఖచ్చితంగా ఉంటుంది. అందుకే, అక్కడా, ఇక్కడా మార్కెట్ ఉన్న మురుగతో మన రామ్ జత కట్టబోతున్నాడట. ఇద్దరి మధ్యా చర్చలు కూడా జరుగుతున్నాయట. త్వరలోనే అధికారిక ప్రకటన అంటున్నారు. చూడాలి మరి, తెలుగు వాడే అయినా కూడా రామ్ చిన్నతనంలో చెన్నైలోనే పెరిగాడు. తమిళం చక్కగా మాట్లాడతాడు. కాబట్టి, వరుసగా తమిళ దర్శకులతో సినిమాలకు సై అంటున్నాడు. ఇటు టాలీవుడ్, అటు కోలీవుడ్ రెండూ చోట్లా మార్కెట్ పెంచుకునే ప్రయత్నాల్లో ఉన్నాడు. లింగుస్వామి, మురుగదాస్ ‘ఇస్మార్ట్ శంకర్’కి ఎంత వరకూ ఉపయోగపడతారో మరి!

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-