రామ్ క్రేజ్ మాములుగా లేదుగా…!

హైదరాబాద్ టైమ్స్ మోస్ట్ డిజైరబుల్ మెన్ 2020 జాబితాలో రామ్ పోతినేని అగ్రస్థానంలో నిలిచారు. టైమ్స్ సంస్థ ప్రతీ యేటా ప్రకటించే ‘మోస్ట్ డిజాయరబుల్ మెన్’… ప్రెస్టేజియస్ లిస్ట్ రిలీజైంది! హైద్రాబాద్ టైమ్స్ పట్టికలో టాప్ పొజీషన్ 2019లాగే 2020లోనూ విజయ్ దేవరకొండ వశమైంది! రెండవ స్థానాన్ని రామ్ పోతినేని సొంతం చేసుకున్నారు. 2019లో 3వ స్థానంలో నిలిచిన రామ్ ఈసారి ఒక సంఖ్యపైకి ఎగబాకి రెండవ స్థానంలో నిలిచాడు. రామ్ నటించిన ఒక్క సినిమా కూడా 2020లో విడుదల కాలేదు. అయినప్పటికీ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలవడం విశేషం. ‘ఇస్మార్ట్ శంకర్’ చిత్రంతో రామ్ క్రేజ్ అమాంతం పెరిగిపోయిందని చెప్పాలి. మ్యాన్లీ లుక్స్ తో మహిళలందరికీ హాట్ ఫేవరెట్‌గా ఉన్నాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ (3), రామ్ చరణ్ (4), నాగ శౌర్య (5), నాగ చైతన్య (6) స్థానాల్లో ఉన్నారు. ఇక రామ్ తదుపరి తెలుగు-తమిళ ద్విభాషా చిత్రం ‘రాపో 19’ ప్రముఖ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో తెరకెక్కనుంది. ఆ తరువాత రామ్-మురుగదాస్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-