ఆ హీరోయిన్లతో రామ్… అనుకోకుండా కలిశారట..!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఇద్దరు హీరోయిన్లతో కలిసి దిగిన ఫోటోలు నెట్టింట్లో హల్చల్ చేస్తున్నాయి. ఇందులో రామ్ తో పాటు అందాల రాక్షసి రామ్ పోతినేని, మలయాళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ కూడా ఉన్నారు. వాళ్ళు మాత్రమే కాకుండా మరో యంగ్ హీరో శ్రీవిష్ణు, దర్శకుడు కిషోర్ తిరుమల కూడా కన్పించారు. రామ్ ఈ పిక్ ను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ “ఇలాంటి ప్రణాళిక లేని మీటప్‌లు చాలా సరదాగా ఉంటాయి..లవ్ ..” అంటూ రాసుకొచ్చారు.

Read Also : వింబుల్డన్ 2021 ఉమెన్స్ సింగిల్స్లో ప్రియాంక చోప్రా… పిక్స్ వైరల్

శ్రీ విష్ణు సెమీ క్యాజువల్ బ్లూ షర్ట్ ధరించగా, బ్లాక్ టీలో రామ్ సూపర్ కూల్ గా ఉన్నాడు. ఇక అనుపమ, లావణ్య అందంగా నవ్వుతూ ఉన్న ఈ పిక్స్ చూసి ఏంటి విశేషమని అడుగుతున్నారు నెటిజన్లు. అనుకోకుండా కలిశామని చెబుతున్నా కూడా ఏదైనా సినిమా ప్లానింగ్ జరుగుతోందా ఈ కాంబినేషన్ లో ? అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అయితే ఈ టీం అంతా గతంలో “ఉన్నది ఒకటే జిందగీ” చిత్రం కోసం కలిసి పని చేశారు. ఆ సినిమా సంగతెలా ఉన్న వీరందరి మధ్య మంచి స్నేహమే కుదిరినట్టుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-