భారీగా రెమ్యూనరేషన్ పెంచేసిన రామ్?

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేనికి టాలీవుడ్ లో మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల “ఇస్మార్ట్ శంకర్”గా ఊర మాస్ గెటప్ తో భారీ మాస్ హిట్ ను అందుకున్నాడు. ఈ చిత్రం తరువాత రామ్ “రెడ్” ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కానీ ఈ చిత్రం ప్రేక్షకులను నిరాశ పరిచింది. అయితే ఈ యంగ్ హీరో సినిమాలను బాలీవుడ్ లోనూ అభిమానులు భారీగానే ఉన్నారు. రామ్ నటించిన హిందీ డబ్బింగ్ చిత్రాలు యూట్యూబ్ లో భారీ వ్యూస్ తో రికార్డులు సృష్టిస్తున్నాయి. తాజాగా రామ్ తన రెమ్యూనరేషన్ ను భారీగా పెంచినట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పుడు రామ్ హీరోగా తమిళ దర్శకుడు లింగుసామి దర్శకత్వంలో ఓ ద్విభాషా చిత్రం రూపొందనుంది. ఈ ప్రాజెక్ట్ ఇతర భాషల్లోకి డబ్ చేయబడుతుంది. ఈ చిత్రంలో రామ్ సరసన “ఉప్పెన” ఫేమ్ కృతి శెట్టి హీరోయిన్ గా నటిస్తోంది. శ్రీనివాస చిత్తూరి నిర్మిస్తున్న ఈ మూవీ రామ్ పోతినేని తన కెరీర్‌లో 19వ చిత్రం కానుంది. ఆ తరువాత రామ్-మురుగదాస్ కాంబినేషన్ లో మరో ద్విభాషా చిత్రం తెరకెక్కనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆయన సుమారు రూ .10 కోట్ల రూపాయలను పారితోషికంగా డిమాండ్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ప్రస్తుతం రామ్ తన మార్కెట్ పరిధిని తెలుగుతో పాటు ఇతర భాషల్లోనూ పెంచుకునే పనిలో పడ్డాడు. ఈ రెండు చిత్రాలపైనే రామ్ ఇప్పుడు ఆశలు పెట్టుకున్నాడు. ఈ చిత్రాలు హిట్ అయితే రామ్ కెరీర్ మరో కీలకమైన మలుపు తీసుకునే అవకాశం ఉంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-