రామ్, లింగుసామి షూటింగ్ అప్డేట్

టాలీవుడ్ హీరో రామ్‌ కథానాయకుడిగా లింగుస్వామి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. ఉప్పెన ఫేమ్ కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. శ్రీనివాసా చిట్టూరి నిర్మాతగా వ్యవహరిస్తుండగా.. ఈ చిత్రంలో రామ్ ఇదివరకు చూడని కొత్త గెటప్ లో కనిపించనున్నారట. పవన్‌ కుమార్‌ సమర్పణలో ‘రాపో 19’ వర్కింగ్‌ టైటిల్‌తో తెరకెక్కనున్న ఈ యాక్షన్‌ మూవీపై రామ్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడు. ఈమధ్యే షూటింగ్ స్టార్ట్ చేద్దామా అంటూ పోస్ట్ కూడా చేశారు. అయితే తాజా సమాచారం మేరకు ఈ చిత్రం జులై 12 నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది. గత నెలలోనే సెట్స్ పైకి వెళ్లాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా షూటింగ్‌ ప్రారంభం కాలేదు. తెలుగు, తమిళ ప్రేక్షకులను అలరించేందుకు లింగుసామి స్క్రిప్ట్‌కు తుది మెరుగులు దిద్దుతున్నారట.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-