ఫైనల్ నేరేషన్ పూర్తయిందంటున్న రామ్

టాలీవుడ్ ఎన‌ర్జిటిక్ స్టార్ రామ్ ప్ర‌స్తుతం తమిళ డైరెక్టర్ లింగుస్వామి ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేస్తున్న సంగ‌తి తెలిసిందే. రామ్‌-లింగుస్వామి కాంబినేష‌న్ లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో ఉప్పెన బ్యూటీ కృతిశెట్టి కథానాయికగా నటిస్తుండగా.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించనున్నారు. చిట్టూరి శ్రీనివాసరావు నిర్మిస్తున్నారు. అయితే తాజాగా ఈ సినిమా ఫైనల్ నేరేషన్ పూర్తయిందని రామ్ ట్వీట్ చేశారు. స్క్రిప్ట్ క‌థ‌నం సూప‌ర్ డూప‌ర్ కిక్ ఇచ్చింది, లవ్ యూ లింగుస్వామి సార్, రోల్ కెమెరా అంటూ షూటింగ్ ప్రారంభం చేద్దాం అన్నట్లుగా ట్వీట్ పెట్టాడు. రామ్ కెరీర్ లోనే హైయెస్ట్ బడ్జెట్ తో సినిమా తెరకెక్కుతోందని సమాచారం. కాగా, అతిత్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-