నేను చావాలని కోరుకొనేవారందరికి సంక్రాంతి శుభాకాంక్షలు- ఆర్జీవీ

సాధారణంగా పండగకు ప్రతి ఒక్కరు అందరు బాగుండాలని కోరుకుంటారు. తమ జీవితంలో మంచి రోజులు రావాలని, ఐశ్వర్యారోగ్యాలు ఉండాలని, తమతో పాటు అందరు కూడా బావుండాలని కోరుకుంటారు. మంచి తెలుస్తూనే శుభాకాంక్షలు తెలుపుతారు. అయితే అందరిలా చెప్తే తనకు వాల్యూ ఏముంటది అనుకున్నాడో.. లేక నా తీరే ఇంత అని మరోసారి నిరూపిద్దామనుకున్నాడో.. వివాదాల దర్శకుడు వెరైటీగా అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. ” అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు. భగవంతుడు మీలో ప్రతి ఒక్కరికి పెద్ద ఇల్లు మరియు ముకేష్ అంబానీ కంటే ఎక్కువ డబ్బుని అనుగ్రహిస్తాడు. ఇప్పుడు కానీ భవిష్యత్తులో కానీ మీకు ఎలాంటి వైరస్ సోకకుండా ఉండాలి. మగవాళ్లందరికి ప్రపంచంలోనే అత్యంత అందమైన స్త్రీని పొందాలని, అందరు స్త్రీలు అత్యంత అందమైన వ్యక్తిని పొందాలని కోరుకుంటున్నాను” అని పాజిటివ్ గా స్టార్ట్ చేసిన వర్మ వరుస ట్వీట్లతో పిచ్చెక్కించాడు.

భర్తలకు శుభాకాంక్షలు తెలుపుతూ” మీ భార్యలు మీరు ఏం చేసినా.. చేయకపోయినా మిమ్మల్ని బాధించకుండా ఉండాలని కోరుకుంటున్నాను” అని చెప్పుకొచ్చాడు. ఇక సినీ నిర్మాతలకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలుపుతూ” సినిమా నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. మీరు ఏ టికెట్ ధరను కోరుకున్నారో, అలాగే ఫ్లాప్‌లలో మీరు పోగొట్టుకున్న డబ్బును కూడా చెల్లించేలా ఏపీ ప్రభుత్వం ఆమోదించేలా దేవుడు చేస్తాడని కోరుకుంటున్నాను అని తెలిపాడు. ఆ తరువాత “చిన్న సినిమా నిర్మాతలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు మరియు మీ ప్రతి చిన్న సినిమా బాహుబలి కంటే చాలా పెద్ద హిట్ అవ్వాలి” అని కోరుకున్నాడు. ఇక చివరగా తన శత్రువులకు సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపాడు. “నన్ను ద్వేషించే వారందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు.. నేను త్వరగా చనిపోవాలని కోరుకున్న ప్రతి ఒక్కరి కోరికను దేవుడు అతి త్వరలోనే తీర్చాలని కోరుకొంటున్నాను” అంటూ చెప్పుకొచ్చాడు. ఏది ఏమైనా వర్మ శుభాకాంక్షలు తెలపడం కొత్త అనుకుంటే ఇలా ప్రతి ఒక్కరికి తమదైన రీతిలో విషెస్ తెలపడం మాత్రం ఆశ్చర్యంగా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఈ ట్వీట్స్ నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles