నాకు కొడాలి నాని ఎవరో తెలియదు.. న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే తెలుసు- ఆర్జీవీ

టాలీవుడ్ సినీ ప్రముఖులకు, ఏపీ ప్రభుత్వానికి మధ్య టికెట్ రేట్ల విషయమై మాటల యుద్ధం జరుగుతున్నా సంగతి తెలిసిందే. ఇక ఇప్పటివరకు ఒక లెక్క.. ఇప్పటినుంచి ఒక లెక్క అన్న చందానా ఈ ఇష్యూలోకి వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఎంటరయ్యి.. టాలీవుడ్ తరుపున తన ప్రశ్నలను ప్రభుత్వానికి వినిపిస్తున్నాడు. రెండు రోజుల నుంచి ఆర్జీవీ ప్రశ్నలకు అంతు లేదు. ప్రశ్నలతో ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. వర్మ ట్వీట్లకు ఏపీ మంత్రి పేర్ని నాని సమాధానాలు చెప్పడంతో ఈ ట్వీట్లు అస్సలు ఆగడం లేదు.

ఇకపోతే తాజాగా వర్మ వేసిన ట్వీట్ మరో సంచలనంగా మారింది. ఈ గొడవలోకి కొడాలి నాని ని కూడా లాక్కొచ్చాడు. ” AP టికెట్ రేట్ల విషయం లో నేను ప్రభుత్వాన్ని అడిగిన ప్రశ్నలకు సంభందించి ఎవరో కొడాలి నాని అనే వ్యక్తి ఇచ్చిన కౌంటర్ కి సమాధానం చెప్పమని కొందరు నన్ను అడుగుతున్నారు. నాకు తెలిసిన నాని న్యాచురల్ స్టార్ నాని ఒక్కడే ..వాళ్ళు చెప్తున్న కొడాలి నాని ఎవరో నాకు తెలియదు” అని బాంబ్ పేల్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles