చంద్రబాబు యాక్షన్.. ఆర్జీవీ రియాక్షన్

వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వివాదం ఎక్కడ ఉంటె అక్కడ నేను ఉన్నాను అంటూ గుర్తుచేస్తాడు. ఈరోజు అసెంబ్లీలో నారా చంద్రబాబు నాయుడు కంటతడి పెట్టుకున్న విషయం తెల్సిందే. ఈ ఘటన ఇరు రాష్ట్రాలలోను సంచలనంగా మారింది. ఇక తాజాగా ఈ ఘటనపై ఆర్జీవీ తనదైన రీతిలో స్పందించాడు. చంద్రబాబు ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేస్తూ తన సినిమా ట్రైలర్ రియాక్షన్ అంటూ చెప్పుకొచ్చాడు. ఈరోజు పవర్ స్టార్/ ఆర్జీవీ మిస్సింగ్ ట్రైలర్ విడుదల అయినా సంగతి విదితమే.. అందులో చంద్రబాబు పాత్రను కూడా చూపించిన వర్మ.. ఆ ట్రైలర్ చూసాక చంద్రబాబు రియాక్షన్ ఇది అని ఆయన ఏడుస్తున్న వీడియోను పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది.

Related Articles

Latest Articles