కట్టప్పను ఎవరు చంపారు ?… ఏపీ ప్రభుత్వంపై ఆర్జీవీ సెటైర్

అప్ టిక్కెట్ల వ్యవహారంపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఇప్పట్లో తగ్గేలా కన్పించడం లేదు. ట్విట్టర్ లో ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో వార్ తరువాత ఆయనను కలవడానికి అనుమతి అడిగాడు. ఆయన కూడా సరేనని చెప్పడంతో నిన్న ఏపీ సచివాలయంలో ఆయనను కలిసి మాట్లాడారు. అయితే ఆర్జీవీ, పేర్ని నాని భేటీతో టాలీవుడ్ కు, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఏర్పడిన గ్యాప్ ఏమన్నా తగ్గుతుందేమో అని అంతా ఎదురు చూస్తున్నారు. అయితే అలా ఎదురు చూస్తున్న వారందరికీ షాక్ ఇస్తూ “కట్టప్పను ఎవరు చంపారు ?” అంటూ మళ్ళీ మొదలెట్టాడు వర్మ. ఏపీ ప్రభుత్వంపై ఇండైరెక్ట్ గా ఆర్జీవీ సెటైర్ వేస్తూ ట్వీట్ చేశారు తాజాగా.

Read Also : షారుఖ్ ఇంటికి బాంబు బెదిరింపులు… నిందితుడు అరెస్ట్

ఆర్జీవీ “రాజమౌళి ‘ఆర్ఆర్ఆర్’ టిక్కెట్ ధర రూ. 2200/-కి మహారాష్ట్రలో అనుమతి ఉంది. ఎక్కడ సినిమా టికెట్ ధర రూ. 2200/-లకు అమ్ముతున్నారు ? అని ప్రశ్నించే వారికి… ఉత్తరాది రాష్ట్రాల్లో ఐనాక్స్ చిహ్న మల్టీప్లెక్స్ చైన్ టిక్కెట్లను రూ. 2200కి విక్రయిస్తోంది. కానీ సొంత రాష్ట్రం ఏపీలో టికెట్లను రూ. 200/-కి విక్రయించడానికి కూడా అనుమతించకపోవడం ఒక ప్రశ్నను లేవనెత్తుతుంది… “కట్టప్పను ఎవరు చంపారు? ” తాజాగా ట్వీట్ చేశారు. దీంతో ప్రముఖ నిర్మాత నట్టి కుమార్ నిన్న అన్నట్టుగా ఆర్జీవీ-పేర్ని నాని మీటింగ్ టైంపాసేనా ? అని ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు.

Related Articles

Latest Articles