మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ?… పేర్ని నానికి ఆర్జీవీ కౌంటర్

గత కొన్ని రోజులుగా వివాదాస్పదంగా మారిన సినిమా టిక్కెట్ ధరల విషయంలో అధికార వైఎస్సార్సీపీ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఆర్జీవీ ధైర్యం చేయడం సంచలనంగా మారింది. ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో మొత్తం సినిమాటోగ్రఫీ మంత్రికి, ఆర్జీవికి మధ్య జరుగుతున్న మాటల యుద్ధం గురించే చర్చ నడుస్తోంది. తాజా ట్వీట్ లో ఆర్జీవీ మీకు, మీ డ్రైవర్ కు తేడా లేదా ? అంటూ ప్రశ్నించడం హాట్ టాపిక్ గా మారింది.

Read Also : బ్రేకింగ్ : “రాధేశ్యామ్” పోస్ట్ పోన్… డార్లింగ్ ఫ్యాన్స్ కు నిరాశ

“గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని సార్, మీ గౌరవప్రదమైన బృందం హీరోల ధరలను అర్థం చేసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అల్లు అర్జున్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు మొదలైన వారి ప్రొడక్షన్ కాస్ట్ అండ్ ట్రాక్ రికార్డు ఆధారంగా ఆశించిన రికవరీ మధ్య సబ్ట్రాక్ట్” మాత్రమే అంటూ వర్మ ఏపీ ప్రభుత్వానికి హీరోల రెమ్యూనరేషన్ విషయంపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఈ ట్వీట్ కు మంత్రి పేర్ని నాని స్పందిస్తూ “హీరోలకు నిర్మాతలు ఇచ్చే రెమ్యూనరేషన్‌కు ఒక ఫార్ములా చెప్పారు. మీరు ఏ హీరోకు ఎంత ఇస్తారు? ఎంత ఖర్చుతో సినిమా తీస్తారు అన్నది పరిగణనలోకి తీసుకుని ఏనాడూ థియేటర్లలో టికెట్ల ధరను ఏ రాష్ట్ర ప్రభుత్వమూ నిర్ణయించదు ఆర్జీవీ గారూ” అంటూ రిప్లై ఇచ్చారు.

Read Also : ‘డిగ్నిటీ’ అంటూ పేర్ని నానికి ఆర్జీవీ సమాధానం !

ఆయన ట్వీట్ కు ఆర్జీవీ “నేనడిగే ముఖ్య ప్రశ్న టికెట్ ధర నిర్ణయించటానికి ప్రభుత్వం ఎవరని? పవన్ కళ్యాణ్ సినిమాకి సంపూర్ణేష్ బాబు సినిమాకి మీ ప్రభుత్వం లో తేడా లేనప్పుడు మంత్రిగా మీకు మీ డ్రైవర్ కి కూడా తేడా లేదా?” అంటూ ఘాటుగా బదులిచ్చారు. అంతేకాదు “నేను యావరేజ్ ఇంజినీరింగ్ స్టూడెంట్ ని. పేర్ని నాని గారు ఎకనామిక్స్ గురించి నాకు ఏబీసీ తెలియదు. కానీ అనుమతిస్తే మీ ప్రభుత్వంలో టాప్ ఎకనామిక్స్ ఎక్స్పర్ట్ తో నేను టీవీ డిబేట్ కి రెడీ. మా సినిమా ఇండస్ట్రీకి, ప్రభుత్వానికి ఏర్పడ్డ మిస్ అండర్స్టాన్డింగు తొలగిపోవడం అవసరం… థ్యాంక్యూ” అంటూ సవాలు విసిరారు ఆర్జీవీ. మరి ఏపీలో టికెట్ల వివాదం ఎక్కడిదాకా వెళ్తుందో చూడాలి.

Related Articles

Latest Articles