“పుష్ప”రాజ్ పై ఆర్జీవీ కామెంట్స్… బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ…!

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఏపీ టికెట్ రేట్ల విషయంపై తనదైన శైలిలో స్పందించి వార్తల్లో నిలిచారు. తాజాగా ఆర్జీవీ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పాన్ ఇండియా మూవీ ‘పుష్ప’ను బాలీవుడ్ సినిమాలతో పోలుస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. డిసెంబర్ 17న విడుదలైన బ్లాక్ బస్టర్ చిత్రం “పుష్ప : ది రైజ్‌”ని ప్రశంసించారు. చాలా సందర్భాలలో అల్లు అర్జున్‌ని తన అభిమాన నటుడు అని పిలిచే ఈ దర్శకుడు ఈ సినిమాతో ప్రాంతీయ సినిమాను జాతీయ స్థాయికి తీసుకెళ్లినందుకు ధన్యవాదాలు తెలిపారు ‘పుష్ప’ టీంకు. 83, యాంటీమ్, సత్యమేవ జయతే-2 వంటి పెద్ద బాలీవుడ్ చిత్రాలు ఉన్నప్పటికీ, ‘పుష్ప’కు దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ రావడం అద్భుతంగా ఉందని ఆర్జీవీ అన్నారు. ఆర్జీవీ ట్వీట్ చేస్తూ “హే అల్లు అర్జున్ 83, యాంటీమ్, సత్యమేవ జయతే-2 వంటి పెద్ద సినిమాలు పోటీగా ఉన్నప్పటికీ ‘పుష్ప’తో వచ్చి ప్రాంతీయ సినిమాని జాతీయ సినిమాగా మార్చినందుకు ధన్యవాదాలు” అని ప్రశంసించారు.

Read Also : రీమేక్ సాంగ్స్ పై దేవిశ్రీ ప్రసాద్‌ షాకింగ్ కామెంట్స్

కొన్ని నెలల క్రితం వివాదాస్పద దర్శకుడు మెగా కుటుంబంపై విరుచుకుపడ్డాడు. అల్లు అర్జున్‌ని సెల్ఫ్ మేడ్ స్టార్ అని పిలిచి, అతన్ని ప్రస్తుత టాలీవుడ్ మెగాస్టార్ గా ప్రకటించాడు. పరిశ్రమలో స్వంతంగా ఎదిగినందుకు అల్లు అర్జున్‌ను చాలా ఇంటర్వ్యూలలో ఆర్జీవీ ప్రశంసించారు. కాగా ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం నిర్ణయించిన టిక్కెట్ ధరలపై ఆయన తీవ్రమైన ప్రశ్నలు లేవనెత్తి టాలీవుడ్ లో హాట్ టాపిక్ అయ్యారు. సినిమా టిక్కెట్లపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించిన ధరల గురించి ఆర్జీవీ, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని మధ్య ట్విట్టర్ వార్ జరిగింది.

Related Articles

Latest Articles