టాలీవుడ్ పెద్దల వలన కానిది వర్మ వల్ల అవుతుందా..?

గత కొన్ని రోజులుగా సినిమా టికెట్ రేట్ల విషయంలో ఏపీ ప్రభుత్వానికి, టాలీవుడ్ కి మధ్య మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఇక గత వారం రోజుల నుంచి ఈ ఇష్యూలో వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ తలదూర్చి సంచలనం సృష్టించిన విషయమూ విదితమే. ఇండస్ట్రీతో నాకు సంబంధం లేదు అంటూనే టికెట్ రేట్స్ ఇష్యూపై తనదైన రీతిలో ఏపీ ప్రభుత్వంపై ప్రశ్నల వర్షం కురిపించిన వర్మ.. ఏ ఒక్క మంత్రిని, చివరికి ముఖ్యమంత్రి జగన్ ని కూడా వదలకుండా ప్రశ్నించాడు. ఇక ఈ ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని తనదైన రీతిలో సమాధానాలు చెప్పారు. ఇలా రెండు రోజులు ట్వీట్స్.. రీ ట్వీట్స్ అంటూ ట్విట్టర్ ఆట ఆడిన వర్మ చివరికి ఇవన్నీ కాదు మంత్రి పేర్ని నానిని కలిసి సామరస్యంగా ఈ సమస్యకు పరిష్కారం చూపాలని తెలిపి గేమ్ ని ముగించాడు. దీనికి అనుకూలంగా స్పందించిన మంత్రి పేర్ని నాని, వర్మకు అపాయిట్మెంట్ ఇచ్చారు.

ఇక ఈ విషయాన్ని వర్మ తాజాగా ట్విట్టర్ ద్వారా తెలిపారు. “జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రిగారు నన్ను ఆహ్వానించారని తెలియజేసేందుకు సంతోషిస్తున్నాము.. సామరస్యపూర్వక పరిష్కారం కోసం AP టిక్కెట్ ధరపై అభిప్రాయాలను మార్పిడి చేసుకునేందుకు మీ దయ చూపినందుకు మంత్రి పేర్ని నానిగారికి ధన్యవాదాలు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ ట్వీట్ పై నెటిజన్లు ట్రోలింగ్ మొదలు పెట్టేశారు. టాలీవుడ్ ప్రముఖులందరి వాలా కానిది.. వర్మ వలన అవుతుందా..? అని కొందరు. అక్కడికి వెళ్లి వర్మ ఏం మాట్లాడతాడో అని మరికొందరు ట్విట్టర్ లో చర్చాగోష్ఠి పెట్టారు. మరి వారన్నట్లుగా టాలీవుడ్ ప్రముఖులందరి వలన కానిది వర్మ వలన సాధ్యమవుతుందా ..? ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందా..? అనేది తెలియాల్సి ఉంది.

Related Articles

Latest Articles