దమ్ముంటే ఏపీ ప్రభుత్వం అలా చేసి చూపించండి- ఆర్జీవీ

టాలీవుడ్ లో ప్రస్తుతం ఏపీ టికెట్ రేట్స్ ఇష్యూ ఎంతటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పలువురు ప్రముఖులు ఈ విషయమై తమ స్పందన తెలియజేస్తున్నారు. మరికొంతమంది మౌనం వహిస్తున్నారు. దీంతో ఈ విషయమై మాట్లాడే పెద్ద దిక్కు ఎవరు లేరా..? అని అభిమానులు ప్రశ్నిస్తున్నారు. ఇక తాజాగా ఈ విషయమై వివాదాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశ్నించడం ప్రస్తుతం సంచలనంగా మారింది. సినిమా టికెట్ల ధరల అంశంపై ఆర్జీవీ అడిగిన ప్రశ్నలు నెట్టింట వైరల్ గా మారాయి. ఒక టీవీ డిబేట్ లో ఆర్జీవీ అడిగిన ప్రశ్నలకు మంత్రి పేర్ని నాని సరిగ్గా సంధానం ఇవ్వలేదన్న విషయం తెలిసిందే. రేకుల షెడ్డు థియేటర్ – మల్టీఫ్లెక్స్ లలో సినిమా టికెట్స్ ఒకేలా ఉండాలనే నిర్ణయాన్ని కాకా హోటల్ – ఫైవ్ స్టార్ హోటల్ ధరలతో పోలుస్తూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.ఇక ఈ డిబేట్ అయ్యాకా సోమవారం రాత్రి వర్మ వోడ్కర్ తాగుతూ మరో వీడియోను రిలీజ్ చేశారు. ఆ వీడియోలో ఏపీ ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు సంధించారు. వాటికి ఏపీ ప్రభుత్వం సమాధానం చెప్పాలని కోరాడు.

“నేను ప్రభుత్వాన్ని ఒకే ఒక్క ప్రశ్న అడుగుతున్నాను .. మానిఫ్రాక్చర్ కి, కన్జ్యూమర్ కి మధ్య ప్రభుత్వం ఎవరు..? రాజమౌళి బాహుబలి 50 కోట్లతో తీసాడు.. వర్మ ఐస్ క్రీమ్ 5 లక్షలతో తీసాడు.. రెండిటికి ఒకటే మూవీ రేట్ అంటే అది మొత్తం మార్కెట్ ని నాశనం చేస్తోంది. అయితే ఇదంతా ఎవరికోసం అంటే.. పేదవారి కోసమని ప్రభుత్వం అంటుంది. అయితే ఇవన్నీ కాకుండా.. టికెట్ రేట్స్ అలాగే ఉంచాలని అనుకుంటే.. మంత్రి కొడాలి నాని, పేర్ని నాని, అనిల్ కుమార్ యాదవ్, వైఎస్ జగన్ మీరందరు కలిసి రాజమౌళి కన్నా మంచి సినిమా తీసి.. ఫ్రీగా రిలీజ్ చేయండి. మీకు అలాంటి కెపాసిటీ లేనప్పుడు.. మీకున్న పవర్ ని ఉపయోగించుకొని కెపాసిటీ ఉన్నవాళ్ళ ప్రతిభను తగ్గించడం రెడిక్యులస్. నిన్నటికి నిన్న మంత్రి పేర్ని నాని మాట్లాడుతూ ” సినిమా నచ్చకపోతే డబ్బులు వెనక్కి ఇస్తారా..? అని అడిగారు. సరే నేను ఒక హోటల్ కి వెళ్లి పీకల దాక తిని.. టేస్ట్ నచ్చలేదు బిల్ కట్టను అంటే ఉరుకొంటారా.. ఒకవేళ మీరు చెప్పేదే కరెక్ట్ అనుకుంటే ‘నాకు వైసీపీ పరిపాలన నచ్చలేదని ఓటేసిన వాడు అంటే వెంటనే మీరు దిగిపోతారా?’.. టమోటా నచ్చలేదు అనడానికి.. టమోటాను కొరికి టేస్ట్ బాగాలేదని చెప్పడానికి చాలా తేడా ఉంది.

ఒక ఫిల్మ్ మేకర్ గా నేను చెప్తున్నది ఏంటంటే. ఏపీ ప్రభుత్వం కింద నుంచి ఇండస్ట్రీని పైకి తీసుకురావాలి కానీ మా నెత్తిన ఎక్కకూడదు.. నిజం చెప్పాలంటే అందరు కూర్చొని మాట్లాడుకుంటే 5 నిమిషాల్లో ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. కానీ నాని ఏదో అన్నాడు.. సిద్దార్థ్ అలా అన్నాడు అంటూ యూట్యూబ్ ఎంటర్ టైన్మెంట్ చేస్తున్నారు. మా ప్రాబ్లెమ్స్ ఇవి .. మా ఇంటెన్షన్స్ ఇవి.. అని వరుస క్రమంలో చెప్పడం మానేసి.. ఎందుకు ఇవన్నీ.. అస్సలు ఈ రెండు పాయింట్లను ఎందుకు అర్ధం చేసుకోవడం లేదు అనేది బ్రహ్మ రహస్యం” అంటూ ముగించాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ గా మారాయి.

Related Articles

Latest Articles