ఆర్జీవీ మరో సంచలన ట్వీట్

గత వారం రోజులుగా ఏపీ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా టిక్కెట్ల ధరలను పెంచాలనే డిమాండ్‌కు సపోర్ట్ చేస్తూ ఆర్జీవీ వార్తల్లో నిలిచారు. న్యూస్ ఛానల్ డిబేట్లలో పాల్గొని వరుస ట్వీట్లు కూడా పెట్టారు. ఆర్జీవీ చేసిన కొన్ని ట్వీట్లపై సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని కూడా స్పందించారు. చర్చకు సమయం కేటాయించాలని మంత్రిని ఆర్జీవీ కోరారు. ఎట్టకేలకు ఆర్జీవీకి మంత్రి అపాయింట్‌మెంట్ ఇచ్చారని ఆర్జీవీ స్వయంగా ట్విట్టర్‌లో ధృవీకరించారు. “జనవరి 10 మధ్యాహ్నం అమరావతి సచివాలయానికి గౌరవనీయులైన సినిమాటోగ్రఫీ మంత్రి నన్ను ఆహ్వానించారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. ఏపీ టికెట్ ధరపై సహృద్భావ పరిష్కారం కోసం మీ దయతో కూడిన చొరవకు ధన్యవాదాలు” అంటూ ఆర్జీవీ నిన్న ట్వీట్ చేశారు. తాజాగా ఆర్జీవీ మరో సంచలన ట్వీట్ చేశారు.

Read Also : హీరోయిన్లతో రిలేషన్… రానా పెళ్లిపై బాలయ్య కామెంట్స్

“చలనచిత్రాలు, థీమ్ పార్కులు, సంగీత కచేరీలు, మ్యాజిక్ షోలు మొదలైనవి కూడా వినోద సంస్థల క్రిందకు వస్తాయి. వాటి టిక్కెట్ ధరలను కూడా ప్రభుత్వం నిర్ణయించలేదు” అంటూ ఆర్జీవీ మరో ట్వీట్ వేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మరో రెండ్రోజుల్లో సినిమా టికెట్ రేట్ల అంశంపై ఏపీ ప్రభుత్వాన్ని కలవనున్న ఆయన ఇప్పుడు ఇలా చిత్రపరిశ్రమతో పాటు మరిన్ని ఎంటర్టైన్మెంట్ షోలకు ప్రభుత్వం ధరలను నిర్ణయించలేదు అంటూ ట్వీట్ చేయడం ప్రాధాన్యతను సంతరించుకుంది. మరి సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడంలో ఆర్జీవీ టాలీవుడ్‌కి, ఏపీ ప్రభుత్వానికి మధ్య ఉన్న గ్యాప్‌ని పూడ్చేస్తారా? అనే ఆసక్తి నెలకొంది టాలీవుడ్ ప్రేక్షకుల్లో !

Related Articles

Latest Articles