ఆర్జీవీ, పేర్ని నాని భేటీ స్టార్ట్… వర్మ ఏం తేల్చబోతున్నాడు?

ఏపీలో సినిమా టికెట్ రేట్ల విషయంపై తాజాగా ఆర్జీవీ, సినిమాటోగ్రఫీ మంత్రి పేర్ని నాని భేటీ అటు సినిమా, ఇటు రాజకీయ వర్గాల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు ఏపీ సచివాలయానికి చేరుకున్న ఆర్జీవీ మంత్రి పేర్ని నాని ఛాంబర్ లో కలిసి మాట్లాడుతున్నారు. గంట నుంచి కొనసాగుతున్న ఈ మీటింగ్ లో టికెట్ల రేట్ల తగ్గింపు వల్ల థియేటర్ యాజమాన్యాలకు నష్టం వాటిల్లుతుందని, ట్విట్టర్ వేదికగా తాను చెప్పిన అంశాలపై ఆర్జీవీ మరింత వివరణఇస్తున్నట్టు తెలుస్తోంది. సమావేశం అనంతరం ఆర్జీవీకి లంచ్ ఆతిథ్యం ఇవ్వబోతున్నారు మంత్రి పేర్ని నాని.

Read Also : ఏపీ టిక్కెట్ల వివాదం లో ఆర్జీవీ వ్యూహం ఫలిస్తుందా..?

ఈ సందర్భంగా భేటీకి ముందు ఆర్జీవీ మీడియాతో మాట్లాడుతూ “ఒక ఫిల్మ్ మేకర్ గా మంత్రి నానితో సినిమా టికెట్ రేట్ల విషయం గురించి మాట్లాడడానికి వచ్చాను. ఆయనకు ఉన్న అనుమానాలు క్లియర్ చేస్తాను. మంత్రి నానితో మాట్లాడి అన్ని విషయాలు చెప్తా. నేను కేవలం నా పాయింట్ ఆఫ్ వ్యూ చెప్పడానికి వచ్చాను” అంటూ చెప్పుకొచ్చారు. నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, నాగార్జున, నట్టి కుమార్ వంటి వారి వ్యాఖ్యలపై స్పందిస్తూ “మిగతా వాళ్ళ ఒపీనియన్ గురించి నేను మాట్లాడను” అన్నారు ఆర్జీవీ. ఇక ఇప్పుడు ఆర్జీవీ భేటీతో ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన వస్తుందా ? అన్నది ఆసక్తికరంగా మారింది.

Related Articles

Latest Articles