ఎన్టీఆర్ పాపులర్ షోకు ఫస్ట్ గెస్ట్ గా స్టార్ హీరో

బుల్లితెర పాపులర్ షో “ఎవరు మీలో కోటీశ్వరులు”తో ఎన్టీఆర్ హోస్ట్ గా రీఎంట్రీ ఇస్తున్న విషయం తెలిసిందే. యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఈ కార్యక్రమానికి సంబంధించిన షూటింగ్ ను పూర్తి చేసే పనిలో పడ్డారు. హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోలో ఈ షో చిత్రీకరణ జరుగుతోంది. అయితే తాజాగా ఈ షో గురించి ఓ ఆసక్తికరమైన వార్త ప్రచారం జరుగుతోంది. అదేంటంటే… “ఎవరు మీలో కోటీశ్వరులు” షోకు ఫస్ట్ గెస్ట్ ఓ స్టార్ హీరో రాబోతున్నాడట.

Read Also : సోనూసూద్ హైదరాబాద్ కు షిఫ్ట్… ఎందుకో తెలుసా?

ఆ స్టార్ హీరో ఎవరంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మకమైన మూవీ “ఆర్ఆర్ఆర్”లో చరణ్ తో ఎన్టీఆర్ స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి విదితమే. ఇక ఈ చిత్రం షూటింగ్ సమయంలో ఇద్దరి మధ్య ఇంతకుముందు ఉన్న స్నేహం కన్నా మంచి బాండింగ్ ఏర్పడింది. మరోవైపు “ఆర్ఆర్ఆర్” ప్రమోషన్ కూడా అవుతుంది. అందుకే ఈ షోకు ఫస్ట్ గెస్ట్ గా చరణ్ ను ఆహ్వానిస్తున్నారట. ఈ వార్తతో ఒక్కసారిగా టెలివిజన్ ప్రేక్షకుల్లో ఆసక్తి పెరిగిపోయింది. కాగా ఈ టీవీ షో ప్రోమోను త్వరలో విడుదల చేయాలని “ఎవరు మీలో కోటీశ్వరులు” బృందం ఆలోచిస్తోంది. పూర్తి వివరాలు త్వరలో వెల్లడిస్తారు. ఈ షోలో నాగార్జున అక్కినేని, మెగాస్టార్ చిరంజీవి ఇంతకుముందు వ్యాఖ్యాతలుగా కన్పించారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-