ఫ్రంట్ లైన్ మెడికల్ టీమ్స్ కు రామ్ చరణ్ సెల్యూట్

కరోనా మహమ్మారి ప్రస్తుతానికి శాంతించింది. ఈ వేసవి ప్రారంభంలో కోవిడ్-19 సెకండ్ వేవ్ ఎఫెక్ట్ గట్టిగానే పడింది. ఇప్పుడిప్పుడే భారతదేశం నెమ్మదిగా సాధారణ స్థితికి చేరుకుంటుంది. దేశవ్యాప్తంగా అర్హులైన పౌరులందరికీ భారతదేశం 100 కోట్ల ప్లస్ కరోనావైరస్ వ్యాక్సిన్‌లను వేయడం విశేషం. ఈ ఫీట్ ను సాధించడానికి ఫ్రంట్ లైన్ వర్కర్స్, వైద్య బృందం చేసిన కృషికి గానూ ప్రశంసలు కురుస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ హీరో రామ్ చరణ్ ట్విట్టర్‌లో దేశంలోని రియల్ హీరోలు ఫ్రంట్‌లైన్ వైద్య బృందాలకు సెల్యూట్ చేశాడు. “చారిత్రక ఘనతను సాధించడానికి సహాయపడిన మా ఫ్రంట్‌ లైన్ వైద్య బృందానికి సెల్యూట్. భారతదేశం విజయవంతంగా 100 కోట్ల టీకాలు వేసింది. #VaccineCentury” అని చరణ్ ట్వీట్ చేశారు.

Read Also : ‘జై భీమ్’ ట్రైలర్ లో లాయర్ గా అదరగొట్టిన సూర్య!

రామ్ చరణ్ సినిమాల విషయానికొస్తే… రాజమౌళితో చరణ్ చేస్తున్న అత్యంత ఆసక్తికరమైన పాన్ ఇండియా మల్టీస్టారర్ “ఆర్ఆర్ఆర్”. ఈ భారీ చిత్రం జనవరి 7న విడుదల కానుంది. ఇటీవల చరణ్ ‘జెర్సీ’ చిత్ర దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో తదుపరి చిత్రానికి సంతకం చేసాడు. మరోవైపు ‘కేజీఎఫ్’ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఓ భారీ ప్రాజెక్ట్ కోసం చర్చలు జరుపుతున్నాడు. శంకర్ డైరెక్షన్‌లో తెరకెక్కనున్న సినిమా షూటింగ్ ప్రారంభించాడు.

Related Articles

Latest Articles