“ఆర్సీ 15” షూటింగ్ స్టార్ట్… మొదట్లోనే సాంగ్… !

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ అండ్ టాలెంటెడ్ ఫిల్మ్ మేకర్ శంకర్‌తో కలిసి చేయబోతున్న భారీ యాక్షన్ డ్రామా “ఆర్సీ15”. ఇందులో రామ్ చరణ్ ఐఏఎస్ పాత్రలో కనిపించబోతున్నారు. కొంతకాలం క్రితం ఈ సినిమా విషయాన్ని అధికారికంగా ప్రకటించారు. ఈ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ లో కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. తాజాగా “ఆర్సీ15” షూటింగ్ పూణేలో ప్రారంభమైంది. మేకర్స్ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెట్‌లో కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ షెడ్యూల్‌లో ప్రధాన నటీనటులు రామ్ చరణ్, కియారా అద్వానీ పాల్గొంటున్నట్లు సమాచారం. హీరోహీరోయిన్లపై ఒక పాటతో పాటు కొన్ని టాకీ పార్ట్‌లను చిత్రీకరించడానికి శంకర్ ప్లాన్ చేస్తున్నాడని వార్తలు వస్తున్నాయి. దాదాపు 3 వారాల పాటు ఈ షెడ్యూల్ జరిగే అవకాశం ఉంది. ఇక ఈ చిత్రాన్ని స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు. నిర్మాతగా ఇది ఆయనకు 50వ చిత్రం. తమన్ సంగీతం అందించబోతున్నారు.

Read Also : రాధేశ్యామ్ టీజర్ : విక్రమాదిత్య మనలో ఒకడు కాదు…!

మరోవైపు రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ “ఆర్ఆర్ఆర్” షూటింగ్ పూర్తయ్యింది. రామ్ చరణ్, ఎన్టీఆర్ కాంబోలో వస్తున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. మరోవైపు రామ్ చరణ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఓ ప్రాజెక్ట్ చేయనున్నారు.

Related Articles

Latest Articles