ఎలక్ట్రానిక్ మీడియాలో రామ్ చరణ్ ఎంట్రీ?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కెరీర్ పీక్స్ లో ఉంది. ఇప్పటికే ఆయన “రంగస్థలం” వంటి సినిమాలతో నటుడిగా నిరూపించుకున్నాడు. “ఖైదీ నంబర్ 150”, “సైరా నరసింహా రెడ్డి” వంటి అధిక బడ్జెట్ చిత్రాలతో నిర్మాతగానూ నిలదొక్కుకున్నాడు. ప్రస్తుతం “ఆర్ఆర్ఆర్” చిత్రంతో పాన్ ఇండియా హీరోగా మారడానికి సిద్ధంగా ఉన్నాడు. ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ఎలక్ట్రానిక్ మీడియాలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడని సమాచారం. మీడియా వర్గాల్లో జరుగుతున్న ప్రచారం ప్రకారం రామ్ చరణ్ త్వరలో ఒక న్యూస్ ఛానెల్ కొనుగోలు చేయబోతున్నాడు. ప్రస్తుతం విన్పిస్తున్న రూమర్లలో అది ఏ ఛానెల్ అనే దానిపై క్లారిటీ లేనప్పటికీ, మహా న్యూస్ అని కొంతమంది అంటున్నారు. ఈ ఛానెల్ కొంతకాలంగా నష్టాల్లో ఉందని, సుజనా చౌదరి, టిజి వెంకటేష్ వంటి రాజకీయ నాయకులు కొంతకాలం పాటు ఈ ఛానెల్‌ని అనధికారికంగా పోషించారని పుకార్లు వచ్చాయి. అయితే ఆ తరువాత వారు దానిని వదిలించుకున్నారట.

Read Also : సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్.. ఆ బైక్ ఎవరిదో తెలుసా ?

తాజా రూమర్స్ ప్రకారం రామ్ చరణ్ ఈ ఛానెల్ కోసం లాభదాయకమైన ఆఫర్ ను ఇచ్చారట. దీనికి సంబంధించిన చర్చలు చివరి దశలో ఉన్నాయని, అన్నీ అనుకున్నట్టుగా జరిగితే ఈ ఛానెల్ త్వరలో చేతులు మారవచ్చు అంటున్నారు. తమ పార్టీకి మీడియా మద్దతు లేదని ‘జనసేన’ అభిమానులలో అసంతృప్తి ఉంది. అందుకే ఒక న్యూస్ చానల్ ప్రారంభించాలని ఆ అభిమానులు రామ్ చరణ్ ని చాలా కాలంగా అడుగుతున్నారు. న్యూస్ ఛానల్ ప్రారంభించాలన్న రామ్ చరణ్ కోరికలు నిజమవుతాయా ? లేదా అనేది తెలియాలంటే వేచి చూడాల్సిందే. .

Related Articles

Latest Articles

-Advertisement-