మరో మైలురాయిని దాటిన మెగా పవర్ స్టార్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డు సృష్టించాడు. ‘ఆర్ఆర్ఆర్’ హీరో తన ఇన్‌స్టాగ్రామ్‌లో 5 మిలియన్లకు పైగా ఫాలోవర్లను సంపాదించాడు. ఈ రికార్డును సాధించిన అత్యంత ప్రజాదరణ పొందిన తెలుగు నటుల జాబితాలో చరణ్ కూడా చేరిపోయాడు. రామ్ చరణ్ ది మంచి స్టైల్ సెన్స్, పర్ఫెక్ట్ దుస్తులను ఎంచుకోవడంలో ప్రత్యేకమైన అభిరుచి. తాజాగా చెర్రీ తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో ఒక ఫోటోను పంచుకున్నాడు. నల్లని దుస్తులు ధరించి ఈ హీరో చాలా హ్యాండ్సమ్ గా కనిపిస్తున్నాడు. రామ్ చరణ్ మెరిసే వెల్వెట్ బ్లాక్ జాకెట్ తో పాటు షూస్ ధరించి, పర్ఫెక్ట్ జెల్ హెయిర్, ట్రిమ్ చేసిన గెడ్డంతో డాపర్ గా కనిపిస్తున్నాడు. చెర్రీ ఈ పిక్ లో తన పెంపుడు కుక్క బ్రాట్‌తో కలిసి ఉన్న వీడియోను కూడా పంచుకున్నాడు.

Read Also : విశాల్, అజిత్ కి థియేటర్లు దొరికేనా!?

కాగా ఇటీవలే రామ్ చరణ్ తాజా చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ కరోనా కారణంగా వాయిదా పడిన విషయం తెలిసిందే. దేశంలో విజృంభిస్తున్న కరోనా మహమ్మారి కారణంగా ఈ సినిమాను నాలుగోసారి వాయిదా వేయాల్సి వచ్చింది. మరోవైపు చరణ్, చిరు కలిసి నటించిన ‘ఆచార్య’ ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఆ తరువాత సంచలన దర్శకుడు శంకర్, యువ చిత్ర నిర్మాత గౌతమ్ తిన్ననూరితో రామ్ చరణ్ రెండు సినిమాలు చేస్తున్నారు.

Related Articles

Latest Articles