అక్క పనితనాన్ని మెచ్చుకున్న మెగా పవర్ స్టార్..

మెగాస్టార్ పెద్ద కూతురు సుస్మిత కొణిదెల నిర్మాణ రంగంలోకి అదుపెట్టిన సంగతి తెలిసిందే. గోల్డ్ బాక్స్ ఎంటర్ టైన్మెంట్ బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తున్న సుస్మిత తాజగా సేనాపతి సినిమాను నిర్మించారు. పవన్ సాధినేని దర్శకత్వంలో డా. రాజేంద్ర ప్రసాద్, నరేష్ అగస్త్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమా ఆహా ఓటిటీ లో స్ట్రీమింగ్ అవుతుంది. సస్పెన్స్ క్రైం థ్రిల్లర్ కి ఎమోషనల్ టచ్ ఇచ్చి నడిపిన ఈ కథ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకొంటుంది.

ఇక ఇటీవల ఈ సినిమా చుసిన చిరంజీవి సైతం సినిమా బావుందని ప్రశసంలు అందించారు. తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. సేనాపతిపై ప్రశంసలు కురిపించాడు. ట్విట్టర్ ద్వారా అక్క సుస్మితకు, సేనాపతి టీమ్ కి శుభాకాంక్షలు తెలిపారు. “సేనాపతి మొత్తం చిత్ర బృందానికి శుభాకాంక్షలు. రాజేంద్ర ప్రసాద్ గారిని టాప్ ఫార్మ్ లో చూడడం అద్భుతంగా ఉంది. సుస్మిత మరియు విష్ణు ప్రసాద్ లకు శుభాకాంక్షలు” అని ట్వీట్ చేశాడు. మొదటి నుంచి సుస్మిత డిఫరెంట్ కథలను ఎంచుకొని వాటిని తెరకెక్కిస్తున్నారు. ఇక అక్క పనితనానికి చరణ్ ముగ్దుడైపోయాడు అనడంలో ఆశ్చర్యం లేదు.

Related Articles

Latest Articles