రాంచరణ్-శంకర్ మూవీ షూటింగ్ కి సర్వం సిద్ధం!

తమిళ స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్, టాలీవుడ్ హీరో రాంచ‌ర‌ణ్ కాంబినేష‌న్ లో ఓ సినిమా తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. పాన్ ఇండియా బ్యాక్ డ్రాప్ లో వ‌స్తున్న ఈ సినిమా షూటింగ్ పై క్లారిటీ వచ్చినట్లుగా ప్రచారం జరుగుతోంది. ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా పూర్తి కావొస్తున్నాయని తెలుస్తోంది. జులై రెండో వారంలో పూజా కార్యక్రమాలు జరుపుకొని, ఆగష్టు మొదటి వారంలో రెగ్యులర్ షూటింగ్ జరగనున్నట్లు సమాచారం. మొదటి షెడ్యూల్ హైదరాబాద్ లోనే జరగనుందని.. దానికి సంబందించిన సెట్స్ పనులు వేగవంతం అయ్యాయని తెలుస్తోంది. రాంచరణ్ కెరీర్ లో 15వ సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మిస్తున్నాడు. చెర్రీ సరసన నటించే కథానాయిక విషయంలో సస్పెన్స్ కొనసాగుతూనే వుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-