“ఆర్ఆర్ఆర్” బిగ్ అప్డేట్… గ్లింప్స్ కు ముహూర్తం ఖరారు

దిగ్గజ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న పీరియాడిక్ డ్రామా “ఆర్ఆర్ఆర్” నుంచి బిగ్ అప్డేట్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్ల కోసం భారీ ప్లాన్లు వేస్తున్నాడు రాజమౌళి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన టీజర్లు, పాటకు మంచి రెస్పాన్స్ రాగా, సినిమా ప్రమోషన్ల కోసం దేశంలోనే అతిపెద్ద మల్టీప్లెక్స్ సంస్థ పీవీఆర్ తో చేతులు కలిపింది. ఇప్పటి నుంచి సినిమా విడుదలయ్యే వరకు పీవీఆర్ థియేటర్లలో “ఆర్ఆర్ఆర్” సినిమా ప్రమోషన్లు జరగనున్నాయి. ఈ మేరకు నిన్న ముంబైలో జరిగిన ఈవెంట్ లో విషయాన్నీ అధికారికంగా ప్రకటించారు. “ఆర్ఆర్ఆర్” విడుదలయ్యే వరకూ పీవీఆర్ “పీవీఆర్ఆర్ఆర్”గా కొనసాగుతుంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్ విడుదల చేయడానికి ముహూర్తం ఖరారు చేశారు మేకర్స్. గ్లింప్స్ ను నవంబర్ 1వ తేదీన ఉదయం 11 గంటలకు విడుదల చేయబోతున్నామని ప్రకటిస్తూ రామ్ చరణ్, ఎన్టీఆర్ లతో కూడిన పోస్టర్ ను వదిలారు మేకర్స్. ఈ వీడియో కేవలం 45 సెకన్లు ఉంటుందని, ఇందులో డైలాగ్స్ ఏం లేకుండా కేవలం ఉత్కంఠభరితమైన సన్నివేశాలు మాత్రమే ఉంటాయని అంటున్నారు.

Read Also : అన్న కొడుకు చేతుల మీదుగా పునీత్ అంత్యక్రియలు

ప్రతిష్టాత్మక చిత్రం “ఆర్ఆర్ఆర్” 2022 జనవరి 7న థియేటర్లలో విడుదల కానుంది. ఈ పీరియాడికల్ ఫిల్మ్‌లో జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, అజయ్ దేవగన్ ప్రధాన పాత్రలు పోషించారు. కోవిడ్-19 మహమ్మారి కారణంగా “ఆర్ఆర్ఆర్” విడుదల తేదీ చాలా సార్లు వాయిదా పడింది. డివివి దానయ్య ‘ఆర్ఆర్ఆర్’ను 450 కోట్లకు పైగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు. ఈ చిత్రం తమిళం, తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ మరియు ఇంగ్లీష్ సహా దాదాపు 10 భాషల్లో విడుదల కానుంది.

Related Articles

Latest Articles