జిమ్ లో చరణ్, కియారా వర్కౌట్స్… వీడియో వైరల్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ మరోసారి జోడి కట్టబోతున్న విషయం తెలిసిందే. విజనరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్ ఇండియా మూవీలో చరణ్ రెండవసారి కియారాతో రొమాన్స్ చేయనున్నారు. ఇంతకుముందు వీరిద్దరూ “వినయ విధేయ రామ”లో జోడిగా కన్పించారు. బోయపాటి దర్శకత్వంలో రూపొందిన ఈ భారీ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ ను మిశ్రమ స్పందన వచ్చింది. కానీ కియారా, చరణ్ ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. తాజాగా వీరిద్దరూ మరోసారి జోడి కడుతుండం ఆసక్తికరంగా మారింది. తాజాగా వీరిద్దరూ కలిసి జిమ్ లో వర్కౌట్లు చేస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇద్దరూ కలిసి జిమ్ లో నిపుణుడి సమక్షంలో ఎక్సర్ సైజులు చేస్తున్నారు. ఫిట్ నెస్ కోసం ఇద్దరూ బాగా శ్రమిస్తున్నారు. కాగా త్వరలోనే “ఆర్సి 15” ప్రారంభం కానుంది. ఈ సినిమాకు “విశ్వంభర” అనే టైటిల్ ను అనుకుంటున్నారనే టాక్ నడుస్తోంది.

Related Articles

Latest Articles