సామ్ ఫ్యాన్స్ గా మారిన రకుల్ ఫ్యామిలీ…!

హిందీ వెబ్ సిరీస్ ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. ఈ సిరీస్ ను రాజ్-డికె ద్వయం వెబ్ సిరీస్ రచన, దర్శకత్వం మాత్రమే కాకుండా నిర్మించారు కూడా. మనోజ్ బాజ్‌పేయి, ప్రియమణి, సమంత తదితరులు ఈ సిరీస్‌లో ప్రధాన పాత్ర పోషించారు. ఇందులో సమంత రాజీ అనే ఉగ్రవాద పాత్రను పోషించింది. ఈ పాత్రలో సామ్ నటనకు సాధారణ ప్రేక్షకులతో పాటు సెలెబ్రిటీల నుంచి కూడా ప్రశంసల జల్లు కురుస్తోంది. తాజాగా సామ్ నటనకు సౌత్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ఫిదా అయిపోయింది. ఈ వెబ్ సిరీస్ ను చూసిన తరువాత ఆమె తన అభిప్రాయాన్ని ట్విట్టర్ ద్వారా పంచుకుంది. ” ‘ది ఫ్యామిలీ మ్యాన్’ సీజన్ 2 చూసాము. ఇందులో అందరూ అద్భుతంగా నటించారు. మనోజ్ బాజ్పాయి ఎంత అద్భుతంగా నటించారో చెప్పడానికి మాటలు చాలట్లేదు. సమంత యు ఫైర్ గర్ల్! రాజీ పాత్రను మీరు ఎంత అద్భుతంగా పోషించారు? నా కుటుంబం కూడా ఇప్పుడు నాతో పాటు మీ అభిమాని అయ్యింది. రాజ్-డికె ద్వయం మీకు అభినందనలు. ఈ సిరీస్ కు సమంత, మనోజ్ బాజ్పాయి, ప్రియమణి ప్లస్ పాయింట్” అని ట్వీట్ చేశారు రకుల్ ప్రీత్ సింగ్.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-