ట్రక్ డ్రైవర్ గా రకుల్ ప్రీత్ సింగ్

ప్రస్తుతం మహిళలు అన్ని రంగాల్లో సత్తా చాటుతున్నారు. అలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకుందో ఏమో రకుల్ ప్రీత్ సింగ్ కూడా ధైర్యంగా ట్రక్ నడిపేసింది. అయితే ఇది నిజంగా కాదు… సినిమా కోసం. ‘సర్దార్ కా గ్రాండ్ సన్’ బాలీవుడ్ సినిమాలో అర్జున్ కపూర్ తో కలసి నటిస్తోంది రకుల్. ఈ కామెడీ డ్రామాలో ఇంకా జాన్ అబ్రహామ్, అదితిరావ్ హైద్రీ, నీనా గుప్త ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. కాస్వీ నాయర్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలోనే ఓ సీన్ లో భాగంగా రకుల్ ట్రక్ డైవింగ్ చేసిందట. ఇదే విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ‘వ్యక్తిగతంగా నాకు డ్రైవింగ్ చేయటం ఎంతో ఇష్టం. అయితే ట్రక్ డ్రైవ్ చేయటం అంత ఈజీ కాదు. ఎంతో నేర్పరితనం ఉండాలి. ఎంతో ఎటెన్షన్ కావాలి. ఇది ఒక కొత్త అనుభవం’ అని చెప్పింది. అయితే సీన్ లో ట్రక్ ని రకుల్ ఎంతో జాగ్రత్తగా ఎలాంటి టెన్షన్ లేకుండా నడిపి యూనిట్ ప్రశంసలు అందుకుంది. అనుభవం ఉన్న ట్రక్ డ్రైవర్ సెట్స్ లో ఉండి నేర్పించినప్పటికీ అమ్మడి డ్రైవింగ్ నేర్పరితనానికి అందరూ ఆశ్చర్యపోయారట. అది రకుల్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేని అనుభంగా మిగిలిపోతుందట.

Related Articles

Latest Articles

-Advertisement-