రకుల్ లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఇదేనట !

పంజాబీ బ్యూటీ రకుల్‌ ప్రీత్ సింగ్ తాజాగా తన లవ్ మ్యాటర్ బయట పెట్టడానికి కారణం ఏంటో వెల్లడించింది. పైగా పెళ్లి విషయంపై కూడా స్పందించింది. ప్రస్తుతం రకుల్ నెక్స్ట్ మూవీ “థాంక్స్ గాడ్” విడుదలకు సిద్ధంగా ఉంది. తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. ఈ చిత్రంలో అజయ్ దేవగన్, సిద్ధార్థ్ మల్హోత్రా ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో రకుల్ ఆసక్తికర విషయాలను వెల్లడించింది. గత నెలలో నిర్మాత, నటుడు జాకీ భగ్నానితో రకుల్ తన లవ్ మ్యాటర్ వెల్లడించింది.

Read Also : హనీ ట్రాప్ లో బాలీవుడ్ నటుడి భార్య అరెస్ట్… కోట్ల నగదు స్వాధీనం

అయితే తాజాగా జాకితో తన రిలేషన్ ను ఎందుకు బయట పెట్టిందో చెప్పుకొచ్చింది రకుల్. “నాకు నచ్చిన విషయాలను వినడానికి మాత్రమే ఇష్టపడతాను. నా వ్యక్తిగత జీవితం గురించి ఎందుకు బయట పెట్టాను అంటే ఇది అందమైన విషయం. నేను దానిని అందరితో పంచుకోవాలి అనుకున్నాను” అని చెప్పుకొచ్చింది. పెళ్లి గురించి మాట్లాడుతూ “ఒక సెలెబ్రిటీ జీవితంపై అందరూ ఎప్పుడూ ఓ కన్నేసి ఉంచుతారు. పబ్లిక్ ఫిగర్‌గా ఉండటంలో ఇదే నెగెటివ్. నా చుట్టూ ఉన్న వ్యక్తుల ప్రభావం నాపై ఏమాత్రం పడకుండా, కెమెరా ముందు నా పని నేను చేస్తాను. అయితే ఆఫ్ కెమెరా నా వ్యక్తిగత జీవితం. నేను పెళ్ళి చేసుకోవాలనుకున్నప్పుడు ఆ విషయాన్నీ ఇతర విషయాల్లాగే అందరితోనూ పంచుకుంటాను. ప్రస్తుతం నేను నా కెరీర్‌పై దృష్టి పెట్టాలనుకుంటున్నాను” అంటూ ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేనట్లు వెల్లడించింది.

Related Articles

Latest Articles