‘ఛత్రీవాలీ’గా రకుల్ ప్రీత్ సింగ్!

రకుల్ ప్రీత్ ఇప్పుడో హిందీ సినిమాలో కండోమ్ టెస్టర్ పాత్రను పోషిస్తోంది. ఈ సోషల్ కామెడీ మూవీని రూనీ స్క్రూవాల ఆర్ఎస్వీపీ బ్యానర్ లో నిర్మిస్తున్నాడు. మరాఠీ దర్శకుడు, ‘బకెట్ లిస్ట్’ ఫేమ్ తేజస్ విజయ్ డియోస్కర్ దీన్ని డైరెక్ట్ చేస్తున్నాడు. ఇప్పటికే దాదాపు ఆరేడు హిందీ సినిమాల్లో గ్లామర్ డాల్ గా నటించిన రకుల్ ప్రీత్ యాక్ట్ చేస్తున్న ఫస్ట్ ఉమెన్ సెంట్రిక్ మూవీ ఇదే! ఈ చిత్రానికి ‘ఛత్రీవాలీ’ పేరును ఖరారు చేసినట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఉత్తరాదిని కండోమ్ ను ఛత్రీ అని ఊరుజనం పిలుస్తుంటారు. రకుల్ పోషిస్తోంది కండోమ్ టెస్టర్ పాత్ర కాబట్టి ఛత్రీవాలీ అనే పేరు కరెక్ట్ గా ఉంటుందని మేకర్స్ భావించారట.
రకుల్ ప్రీత్ సింగ్ కంటే ముందు ఈ కథను దర్శకుడు తేజస్ విజయ్… సారా అలీఖాన్ కు, అనన్యపాండేకు వినిపించాడట. వాళ్ళిద్దరూ ఈ ప్రాజెక్ట్ ను తిరస్కరించారట. కథ విన్న వెంటనే నటించనని సారా చెబితే, కాన్సెప్ట్ తో పాటు హీరోయిన్ పాత్ర మరీ బోల్డ్ గా ఉందని అనన్య పాండే నో చెప్పిందట. మొత్తానికి రాకరాక ఉమెన్ సెంట్రిక్ పాత్ర లభించిందని రకుల్ వెంటనే అంగీకరించిందని అంటున్నారు. ‘సర్దార్ అండ్ గ్రాండ్ సన్’ మూవీతో రకుల్ ప్రీత్ సింగ్ డిజిటల్ ఎంట్రీ ఇవ్వబోతోంది. నిజానికి ఆ సినిమాను థియేట్రికల్ రిలీజ్ కోసం తీశారు. కానీ పరిస్థితులు బాగోకపోవడంతో నెట్ ఫ్లిక్స్ లో రిలీజ్ చేస్తున్నారు. ఇప్పుడు ‘ఛత్రీవాలీ’ సినిమాను మాత్రం కేవలం ఓటీటీని దృష్టిలో పెట్టుకునే తీస్తున్నారట. సో… ఈ బోల్డ్ సబ్జెక్ట్ లో కుర్రకారు ఇష్టపడే సన్నివేశాలకు కొదవే ఉండకపోవచ్చు. అయితే… ఈ బోల్డ్ కంటెంట్ ను కూడా హ్యూమరస్ గానే తెరకెక్కిస్తామని దర్శకుడు తేజస్ విజయ్ చెబుతున్నాడు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-