వ్యవసాయ చట్టాల రద్దుకు ఆమోదం.. ఇలా స్పందించిన టికాయత్

పార్లమెంట్ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే విపక్షాల ఆందోళనలతో వాయిదాల పర్వానికి తెరలేపింది.. మరోవైపు.. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని.. వ్యసాయ చట్టాలను తీసుకొచ్చిన నరేంద్ర మోడీ సర్కార్.. ఆ బిల్లులను రద్దు చేస్తున్నట్టు ఇప్పటికే ప్రకటించగా.. ఇవాళ వ్యవసాయ సాగు చట్టాల రద్దు బిల్లును కేంద్ర ప్రభుత్వం లోక్‌సభలో ప్రవేశపెట్టడం.. మూజువాణి ఓటుతో ఆమోదం పొందడం జరిగిపోయాయి.. ఇక, లోక్ సభలో వ్యవసాయ చట్టాల రద్దు ఆమోదంపై స్పందించారు బీకేయూ నేత రాకేష్ టికాయత్… లోక్‌సభ ఆమోదించిన వ్యవసాయ చట్టాల రద్దు బిల్లు, ఆందోళన సమయంలో ప్రాణాలు కోల్పోయిన 750 మంది రైతులకు నివాళిగా భావిస్తామన్న ఆయన.. పంటల మద్దతు ధరకు చట్టబద్దత కల్పించడంతో సహా, ఇతర సమస్యలు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయని గుర్తుచేశారు.. అవి అన్ని పరిష్కారం అయ్యే వరకు రైతు ఉద్యమం కొనసాగుతుందని ప్రకటించారు రాకేష్‌ టికాయత్‌.

Related Articles

Latest Articles