ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన ‘అన్నాత్తే’ రైట్స్

సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న తాజా చిత్రం ‘అన్నాత్తే’. దీపావళి కానుకగా విడుదల కానున్న ఈ చిత్రం టీజర్ ఈరోజు సాయంత్రం విడుదల కానుంది. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా రైట్స్ ఫ్యాన్సీ రేటుకు అమ్ముడయ్యాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు సంబంధించిన థియేట్రికల్ రైట్స్ ను టాప్ డిస్ట్రిబ్యూటర్స్ ఏషియన్ సినిమాస్ రూ.12 కోట్ల ఫ్యాన్సీ రేటుకు కొనుగోలు చేసింది. ప్రముఖ నిర్మాత సురేష్ బాబు ఈ చిత్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో పంపిణీ చేయబోతున్నారు. ఏషియన్ సినిమాస్ నైజాంలో విడుదల చేస్తుంది. ఈ రేట్లను బట్టి చూస్తుంటే తెలుగు రాష్ట్రాల్లో రజినీకాంత్ మార్కెట్ బాగా పడిపోయినట్లు కన్పిస్తోంది. రజినీ గత సినిమాలు ఇక్కడ పెద్దగా ఆడకపోవడం ఈ సినిమా రైట్స్ ఇంత తక్కువ రేటుకు అమ్ముడవడానికి కారణం.

Read Also : ‘మా’ ఎన్నికల అధికారిని సీసీటీవీ ఫుటేజ్ కోరిన ప్రకాశ్ రాజ్

ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ లో సూపర్‌స్టార్ రజనీకాంత్‌తో పాటు ఖుష్బూ, మీనా, నయనతార, కీర్తి సురేష్, ప్రకాష్ రాజ్, జగపతి బాబు, సూరి, సతీష్, బాల (దర్శకుడు శివ సోదరుడు) వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలలో నటించారు. డి ఇమ్మాన్ సంగీతం అందించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఇప్పుడు పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మించింది. ‘అన్నాత్తే’ నవంబర్ 4 న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతుంది.

-Advertisement-ఫ్యాన్సీ రేటుకు అమ్ముడైన 'అన్నాత్తే' రైట్స్

Related Articles

Latest Articles