సడన్ గా అమెరికాకు వెళ్లిన రజనీకాంత్.. ఏమైవుంటుంది?

సూపర్ స్టార్ రజనీకాంత్ సడెన్ గా అమెరికా వెళ్లినట్లుగా తెలుస్తోంది. దీంతో ఆయన అభిమానులు ఆందోళనకు గురయ్యారు. రజనీ అనారోగ్యానికి గురయ్యారని ఈ కారణంగానే అత్యవసరంగా ప్రత్యేక విమానంలో అమెరికా బయల్దేరారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. అయితే ఆయన సాధారణ మెడికల్ చెకప్స్ కోసం అమెరికా వెళ్లారని తెలుస్తోంది. ఈమధ్య ఆయన అనారోగ్యానికి సంబంధించి వార్తలు వస్తుండటంతో.. రజనీ సడన్ గా అమెరికా వెళ్లడంతో ఆయన అభిమానులు కంగారు పడ్డారు. కరోనా పరిస్థితుల్లో విదేశీ ప్రయాణాలపై ఆంక్షలు ఉండడంతో ప్రత్యేక విమానంలో వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఇక రజనీ అల్లుడు ధనుష్, కూతురు అమెరికాలోనే ఉన్నట్లుగా తెలుస్తోంది. ఓ హాలీవుడ్ చిత్రంలో ధనుష్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-