రజినీకాంత్ రిటైర్మెంట్ ప్లాన్ ఇదేనట…!?

సూపర్ స్టార్ రజనీకాంత్ తన ఆరోగ్య సమస్యల కారణంగా నటన నుండి రిటైర్మెంట్ తీసుకోవాలని భావిస్తున్నట్టు పుకార్లు వస్తున్నాయి. తాజాగా కోలీవుడ్ వర్గాల సమాచారం మేరకు రజనీ స్వయంగా “అన్నాత్తే” చిత్రం సిబ్బందితో తన రిటైర్మెంట్ ప్లాన్ గురించి చర్చించారట. రజినీ ఇటీవలే “అన్నాత్తే” చిత్రీకరణను హైదరాబాద్‌లో పూర్తి చేశారు. ఈ షెడ్యూల్ లో షూటింగ్ పూర్తయ్యాక సిబ్బందితో లొకేషన్‌లో మాట్లాడుతూ తన యాక్టింగ్ రిటైర్మెంట్ ప్రణాళికను వెల్లడించారని సమాచారం. రజనీకాంత్ 1975 నుండి సినిమాల్లో నటిస్తున్నారు. సాధారణ బస్సు కండక్టర్ నుండి దేశంలో అతిపెద్ద సూపర్ స్టార్ గా ఎదిగిన ఈ 70 ఏళ్ల సూపర్ స్టార్ భారీ సంఖ్యలో అభిమానులను సంపాదించాడు. దాదాపు 160కి పైగా చిత్రాల్లో నటించిన రజిని రిటైర్మెంట్ కు ముందు మరికొన్ని సినిమాలు చేయాలనుకుంటున్నానని చెప్పారట. అందుకు ఆయన ఆరోగ్యం కూడా మంచి స్థితిలో ఉండాలని అన్నారు. కోవిడ్ -19 ఎఫెక్ట్ తగ్గిన తరువాత రజనీకాంత్ ఆరోగ్య పరీక్షల కోసం అమెరికా వెళ్ళడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-