హైదరాబాద్ ఐకియా వద్ద సూపర్ స్టార్ రజినీకాంత్…!!

సూపర్ స్టార్ రజనీకాంత్, దర్శకుడు సిరుతై శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ‘అన్నాత్తే’. ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే హైదరాబాద్ కు చేరుకున్నారు రజినీకాంత్. గత కొన్ని వారాలుగా ఈ సినిమా షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో జరుగుతోంది. తాజా అప్డేట్ ఏంటంటే… ‘అన్నాత్తే’ బృందం ఈరోజు హైదరాబాద్ లోని ఐకియా స్టోర్ లో తాజా షెడ్యూల్ షూటింగ్ ను ప్రారంభించింది. నగరంలోని ఐకియా స్టోర్ వద్ద కొన్ని కీలకమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కూడా ఐకియా స్టోర్ వద్ద జరిగే షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇక ‘అన్నాత్తే’ ప్రధాన పాత్రధారులలో ఒకరైన లేడీ సూపర్ స్టార్ నయనతార ఈరోజు హైదరాబాద్ లో అడుగు పెట్టింది. ఆమె రేపు సినిమా షూటింగ్ లో జాయిన్ కానుంది. రజనీకాంత్‌తో ఆమె కాంబినేషన్ సన్నివేశాలు మరికొన్ని రోజులు చిత్రీకరించబడతాయని తెలుస్తోంది. కాగా సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తి సురేష్, నయనతార, జగపతి బాబు, ప్రకాష్ రాజ్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఇమ్మాన్ సంగీత సారథ్యం వహిస్తున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-