ఆకట్టుకున్న రజనీ ‘అన్నాత్తే’ మోషన్ పోస్టర్

తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం “అన్నాత్తే” మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చివరిదశలో వుంది. స్టార్ డైరెక్టర్ శివ తెరకెక్కిస్తుండగా.. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. నయనతార, కీర్తి సురేష్, మీనా, ఖుష్బూ, ఈ సినిమాలో నటించడం విశేషం. కాగా, నేడు వినాయక చవితి సందర్భంగా ఉదయం చిత్ర ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయగా, సాయంత్రం మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు. ఉదయం ఫస్ట్‌లుక్‌లో తెల్లషర్టు & పంచెకట్టుతో అందరినీ అలరించిన రజనీ.. ప్రస్తుత మోషన్ పోస్టర్ లో మాత్రం బైకుపై వస్తూ.. చేతిలో వున్నా కత్తితో మంటలు రాజేస్తున్నారు.. విభిన్నమైన యాక్షన్‌ డ్రామా కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా దీపావళి కానుకగా నవంబర్ 4వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Articles

Latest Articles

-Advertisement-