రాజస్థాన్ రాజకీయం… మంత్రులంతా రాజీనామా

రాజ‌స్థాన్‌ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఆ రాష్ట్రంలోని అశోక్ గెహ్లాట్ ప్ర‌భుత్వం కేబినెట్‌ మొత్తాన్ని పునర్ వ్యవస్థీకరించాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కేబినెట్‌ మంత్రులంతా శనివారం రాజీనామా చేశారు. మంత్రుల నుంచి రాజీనామా పత్రాలను సీఎం అశోక్‌ గెహ్లాట్‌ సేకరించి.. మంత్రుల రాజీనామాలను ఆమోదించారు. ఆదివారం సాయంత్రం కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఈ నేపథ్యంలో తొలుత ఆదివారం మధ్యాహ్నం 2 గంటలకు పీసీసీ సమావేశాన్ని కాంగ్రెస్ నేతలు నిర్వహించనున్నారు. మరోవైపు మంత్రుల రాజీనామా అనంతరం సీఎం అశోక్‌ గెహ్లాట్‌ శనివారం రాత్రి గవర్నర్‌ నివాసానికి వెళ్లారు. గవర్నర్‌ కల్‌రాజ్ మిశ్రాను కలిసి క్యాబినెట్‌ పున‌ర్‌వ్య‌వ‌స్థీక‌రణపై చర్చించారు.

Read Also: గుండెలను పిండేస్తున్న బాలిక సూసైడ్ నోట్.. ఏం రాసిందంటే..?

రాజస్థాన్‌లో కేబినెట్ పునర్ వ్యవస్థీకరణ సందర్భంగా నూతన మంత్రుల నియామకం కోసం కాంగ్రెస్ అధిష్టానం తీవ్ర కసరత్తులు ప్రారంభించింది. ఈ మేరకు ఆదివారం నాడు ఢిల్లీలోని కాంగ్రెస్ అధిష్టానం కొత్త మంత్రుల జాబితాను రాజస్థాన్ ప్రభుత్వానికి పంపనుంది. ప్రస్తుతం రాజస్థాన్‌ శాసనసభలో కాంగ్రెస్ పార్టీకి ఉన్న సభ్యుల ప్రకారం.. గరిష్టంగా 30 మంది మంత్రులు ఉండే అవకాశం ఉంది. కొత్త జాబితా వచ్చిన అనంతరం ఆదివారం సాయంత్రం 4 గంటలకు కొత్త మంత్రివర్గ ప్రమాణస్వీకార కార్యక్రమం జరగనుంది. గతంలో హైకమాండ్ ఇచ్చిన హామీ మేరకు మంత్రివర్గంలో సచిన్ పైలట్ కు స్థానం దక్కే అవకాశముంది. ఇప్పటికే నూతన కేబినెట్ అంశంపై ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి అజయ్ మాకెన్, పీసీసీ చీఫ్ గోవింద్ సింగ్ దోతస్రా సీఎం అశోక్ గెహ్లాట్ నివాసానికి వెళ్లి చర్చలు జరిపినట్లు తెలుస్తోంది.

Related Articles

Latest Articles