ఐపీఎల్ 2021 : మరో ఓటమిని ఖాతాలో వేసుకున్న హైదరాబాద్

ఈరోజు ఢిల్లీ వేదికగా ఐపీఎల్ లో రాజస్థాన్ రాయల్స్ తో జరిగిన మొదటి మ్యాచ్ లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తమ ఖాతాలో మరో ఓటమిని వేసుకుంది. అయితే ఈ మ్యాచ్ 221 పరుగుల భారీ లక్ష్య ఛేదనకి వచ్చిన సన్‌రైజర్స్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో (31), మనీష్ పాండే(30) పర్వాలేదనిపించిన ఆ తర్వాత ఏ ఆటగాడు కూడా రాణించలేదు. వచ్చిన వారు అందరూ స్వల్ప పరుగుల వ్యవధిలో పెవిలియన్ కు చేరుకుంటూ ఉండటంతో హైదరాబాద్ నిర్ణిత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 165 పరుగులు మాత్రమే చేసింది. దాంతో రాజస్థాన్ 55 పరుగుల తేడాతో ఈ ఐపీఎల్ లో మూడో విజయాన్ని నమోదు చేసి పాయింట్ల పట్టికలో 5వ స్థానానికి చేరుకుంది.

ఇక అంతకముందు మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ జట్టులో కెప్టెన్  సంజు(48) తో రాణించగా ఓపెనట్ బట్లర్(124) సెంచరీ పూర్తి చేసాడు. దాంతో  20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 220 పరుగులు సాధించింది రాయల్స్.

Related Articles

Latest Articles