ఐపీఎల్ 2021 : టాస్ గెలిచిన రాయల్స్…

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో రాయల్స్ కు మొదటిసారి కెప్టెన్ గా సంజు శామ్సన్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. దాంతో ఈ ఐపీఎల్ లో పేరు మార్చుకొని బరిలోకి దిగ్గుతున్న పంజాబ్ మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ రెండు జట్లు బ్యాటింగ్, బౌలింగ్ లో సమానంగా కనిపిస్తుండటంతో ఈ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారు అనేది చూడాలి. అయితే రాయల్స్ కు ఆ జట్టు పేసర్ జాఫ్రా ఆర్చర్ లేకపోవడం నష్టమే అని చెప్పాలి.

రాజస్థాన్ : జోస్ బట్లర్ (w), మనన్ వోహ్రా, బెన్ స్టోక్స్, సంజు సామ్సన్ (c), రియాన్ పరాగ్, శివం దుబే, రాహుల్ టెవాటియా, క్రిస్ మోరిస్, శ్రేయాస్ గోపాల్, చేతన్ సకారియా, ముస్తాఫిజుర్ రెహ్మాన్ 

పంజాబ్ : కేఎల్.రాహుల్ (w/c), మయాంక్ అగర్వాల్, క్రిస్ గేల్, నికోలస్ పూరన్, దీపక్ హుడా, షారుఖ్ ఖాన్, రిచర్డ్సన్, మురుగన్ అశ్విన్, రిలే మెరెడిత్, మహ్మద్ షమీ, అర్ష్దీప్ సింగ్

Related Articles

Latest Articles