ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్

ఈ రోజు వీకెండ్ సందర్భంగా ఐపీఎల్ లో రెండు మ్యాచ్ లు జరగనున్నాయి. అందులో రెండవ మ్యాచ్ రాజస్థాన్ రాయల్స్ – చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరుగుతుంది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన రాయల్స్ కెప్టెన్ సంజు బౌలింగ్ ఎంచుకోవడంతో చెన్నై మొదట బ్యాటింగ్ చేయనుంది. ఇక ఈ మ్యాచ్ లో రాజస్థాన్ కొన్ని మార్పులతో బరిలోకి వస్తుంది. అయితే ఇప్పటికే ప్లే ఆఫ్స్ కు చేరిన చెన్నై కి ఈ మ్యాచ్ అంత కీలకం కాకపోయినా రాజస్థాన్ ప్లే ఆఫ్స్ రేస్ లో ఉండటానికి చాలా కీలకం. ఈ మ్యాచ్ లో గెలిస్తేనే రాజస్థాన్ 4వ స్థానం కోసం జరుగుతున్న రేస్ లో పంజాబ్, కోల్ కత్తా , ముంబై తో కలిసి ఉంటుంది. లేదంటే దాదాపుగా ప్లే ఆఫ్స్ పైన ఆశలు వాదులు కోవాల్సిందే. కానీ విజయం సాధిస్తే మాత్రం ఈ ఏడాది ఐపీఎల్ ఆఫ్స్ రేస్ మరింత ఉత్కంఠంగా జరుగుతుంది. చుడాలిమరి ఏ జట్టు ఈ మ్యాచ్ లో విజయం సాధిస్తుంది అనేది.

-Advertisement-ఐపీఎల్ 2021 : టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్

Related Articles

Latest Articles