ఐపీఎల్ 2021 : 185 పరుగులకు ఆల్ ఔట్ అయిన రాజస్థాన్

ఐపీఎల్ 2021 లో ఈరోజు పంజాబ్ కింగ్స్-రాజస్థాన్ రాయల్స్ మధ్య మ్యాచ్ జరుగుతుంది. అయితే ఈ మ్యాచ్ లో టాస్ ఒడి మొదట బ్యాటింగ్ కు వచ్చిన రాయల్స్ కు శుభారంభమే లభించింది. జట్టు ఓపెనర్లు ఎవిన్ లూయిస్(36), యశస్వి జైస్వాల్(49) పరుగులతో రాణించి ఇద్దరు అర్ధశతక భాగసౌమ్యని నెలకొల్పారు. కానీ ఆ తర్వాత రాజస్థాన్ బ్యాట్స్మెన్స్ అందరూ పెవిలియన్ దారి పట్టారు. మహిపాల్ లోమ్రోర్(43), లివింగ్‌స్టోన్(25) మినహా మిగితా వారెవరు కానీసం రెండంకెల స్కోర్ కూడా చేయలేదు. ఇక చివరి ఓవర్లో ఆఖరి రెండు బంతులకు రెండు వికెట్లు కోల్పోయిన ఆర్ఆర్ 185 పరుగుల వద్ద ఆల్ ఔట్ అయ్యింది. ఇక పంజాబ్ బౌలర్లలో అర్షదీప్ సింగ్ ఒక్కడే సగం రాజస్థాన్ ను వెనక్కి పంపి 5 వికెట్ హల్ సాధించాడు. అలాగే మిగిలిన బౌలర్లలో షమీ 3 వికెట్లు, ఇషాన్ పోరెల్, హర్‌ప్రీత్ బ్రార్ ఒక్కో వికెట్ తీశారు. అయితే ఈ మ్యాచ్ గెలవాలంటే పంజాబ్ 20 ఓవర్లలో 186 పరుగులు చేయాలి. చూడాలి మరి ఏం జరుగుతుంది అనేది.

-Advertisement-ఐపీఎల్ 2021 : 185 పరుగులకు ఆల్ ఔట్ అయిన రాజస్థాన్

Related Articles

Latest Articles