దేశంలో మ‌రో సీఎంకు క‌రోనా…

క‌రోనాకు వారు వీరు అనే తేడాలేదు.  ఎవ‌ర్నీ వ‌ద‌ల‌డం లేదు.  సామాన్యుల నుంచి రాజ‌కీయ నాయ‌కుల వ‌ర‌కు క‌రోనా బారిన ప‌డుతున్నారు.  ఇటీవ‌లే ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ క‌రోనా బారిన ప‌డ్డారు.  ప్ర‌స్తుతం ఆయ‌న హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్నారు.  కాగా, తాజాగా మ‌రో సీఎం క‌రోనా బారిన ప‌డ్డారు.  రాజ‌స్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ క‌రోనా బారిన ప‌డిన‌ట్టు ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు.  ల‌క్ష‌ణాలు పెద్ద‌గా లేవ‌ని, వైద్యుల స‌ల‌హా మేర‌కు వారం రోజుల‌పాటు హోమ్ ఐసోలేష‌న్‌లో ఉన్న‌ట్టుగా తెలిపారు.  

Read: ఢిల్లీలో భారీగా పెరిగిన కేసులు… 15 శాతం దాటిన పాజిటివిటీ రేటు…

కోవిడ్ ప్రోటోకాల్ ప్ర‌కారం ఈ నాలుగైదు రోజుల్లో త‌న‌ను క‌లిసిన వారు క‌రోనా ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని అన్నారు.  క‌రోనా నిబంధ‌న‌ల‌ను త‌ప్ప‌ని స‌రిగా ప్ర‌తి ఒక్క‌రూ ఫాలో కావాల‌ని అన్నారు.  మాస్క్ ద‌రించాల‌ని, నిబంధ‌న‌లు పాటించాల‌ని కోరారు.  దేశంలో థ‌ర్డ్ వేవ్ ఎంట‌ర్ అయింద‌ని ఇప్ప‌టికే వార్త‌లు వ‌స్తున్నాయ‌ని, రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, అర్హులైన చిన్నారులు కూడా వ్యాక్సిన్ తీసుకోవాల‌ని ఆయ‌న కోరారు.  

Related Articles

Latest Articles