దొంగల గుట్టుపట్టేస్తున్న జీపీఎస్.. బుల్లెట్ రికవరీ

ఈజీమనీ కోసం దొంగతనాలు చేసేవారు ఎక్కువయ్యారు. అయితే ఆధునిక టెక్నాలజీ సాయంతో వారి ఆటలు సాగడం లేదు. గుట్టుచప్పుడు కాకుండా దొంగతనాలు చేసేవారు గుట్టు రట్టవుతోంది. సీసీ కెమేరాలతో పాటు సెల్ ఫోన్ సిగ్నల్స్, జీపీఎస్ ద్వారా దొంగల్ని పట్టుకుని సొత్తు రికవరీ చేస్తున్నారు పోలీసులు. తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జీపీఎస్ ద్వారా బుల్లెట్ దొంగలు పట్టుబడ్డారు. కడియపులంకలో చోరీకి గురైన రెండు లక్షల రూపాయల బుల్లెట్ జీపీఎస్ ద్వారా గుర్తించారు పోలీసులు.

చోరీకి గురైన తన బుల్లెట్ రాజమండ్రిలో ఉన్నట్లు గుర్తించిన నర్సరీ యజమాని పోలీసులకు విషయం అందించాడు. జీపీఎస్ ట్రాక్ చేసి బుల్లెట్ దొంగల్ని అరెస్టు చేశారు పోలీసులు. ఈ బుల్లెట్ తో పాటు మరో 13 బైక్ లు స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. యజమానులు అత్యాధునిక టెక్నాలజీని వాడితే దొంగతనాలు తక్కువగా జరుగుతాయని, దొంగలు దొంగిలించినా వాటిని సులభంగా గుర్తించవచ్చంటున్నారు పోలీసులు.

Related Articles

Latest Articles