పోలీసుల‌పై రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్!

క‌రోనా స‌మ‌యంలో ప్ర‌త్య‌క్షంగానూ, ప‌రోక్షంగానూ ప‌లు సేవాకార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నాడు ద‌ర్శ‌క దిగ్గ‌జం ఎస్.ఎస్. రాజ‌మౌళి. ఇప్పుడు ఆ సేవల‌ను మ‌రోర‌కంగా విస్త‌రించ‌బోతున్నాడు. ప్రాణాల‌ను ప‌ణంగా పెట్టి ఉద్యోగ బాధ్య‌త‌ల‌ను నిర్వ‌ర్తిస్తున్న పోలీసుల‌పై రాజ‌మౌళి ఓ షార్ట్ ఫిల్మ్ తీయ‌బోతున్నాడ‌ట‌. దీని నిడివి 19 నిమిషాలు ఉంటుంద‌ని తెలుస్తోంది. ఈ షార్ట్ ఫిల్మ్ రూప‌క‌ల్ప‌న విష‌య‌మై ఇటీవ‌ల రాజ‌మౌళి సైబ‌రాబాద్ సి.పి. స‌జ్జ‌నార్, హైద‌రాబాద్ సి.పి. అంజ‌నీ కుమార్, రాచ‌కొండ సి. పి. మ‌హేశ్ భ‌గ‌వ‌త్ ల‌తో చ‌ర్చ‌లు జ‌రిపార‌ట‌. వారందరి నుండి పాజిటివ్ ఫీడ్ బ్యాక్ రావ‌డంతో రాజ‌మౌళి షార్ట్ ఫిల్మ్ నిర్మాణంపై ముంద‌డుగు వేశార‌ట‌. ఈ ల‌ఘు చిత్రం ద్వారా రాజ‌మౌళి పోలీసుల ప్రాధాన్యం, క‌రోనా స‌మ‌యంలో స‌మాజానికి వారు చేస్తున్న సేవ గురించి చ‌క్క‌ని, బ‌ల‌మైన సందేశాన్ని ఇవ్వ‌బోతున్నార‌ట‌. ఇదిలా ఉంటే… ప్ర‌స్తుతం ట్రిపుల్ ఆర్ మూవీని తెర‌కెక్కిస్తున్న రాజ‌మౌళి అది పూర్తి కాగానే మ‌హేశ్ బాబుతో సినిమా చేస్తాడ‌ని అంటున్నారు.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-