“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” రెస్పాన్స్ పై రాజమౌళి రియాక్షన్ !

“ఆర్ఆర్ఆర్” అప్డేట్ గురించి ఎంతగానో ఎదురు చూస్తున్న ప్రేక్షకులకు ‘రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్’ మేకింగ్ వీడియోతో అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు రాజమౌళి. కొన్నిరోజుల నుంచి ఈ వీడియో గురించే చర్చ నడుస్తోంది. నిన్న విడుదలైన వీడియోతో “ఆర్ఆర్ఆర్” టీం టాక్ అఫ్ ది టౌన్ గా మారిపోయారు. ఇక రాజమౌళి విషయానికొస్తే ఆయన కేవలం అద్భుతమైన దర్శకుడు మాత్రమే కాదు మంచి మార్కెటింగ్ నిపుణుడు కూడా. తన సినిమాలను ప్రచారం ఎలా చేసుకోవాలో ఆయనకు బాగా తెలుసు.

Read Also : ఫస్ట్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న “బీస్ట్” బ్యూటీ

“రోర్ ఆఫ్ ఆర్ఆర్ఆర్” వీడియోకు ప్రేక్షకుల నుంచి సూపర్ రెస్పాన్స్ కు రాజమౌళి ఫుల్ హ్యాపీగా ఉన్నారట. ట్విట్టర్ ద్వారా ఆయన తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. “ఆర్ఆర్ఆర్ మూవీ మేకింగ్ వీడియోకు అద్భుతమైన స్పందన వస్తోంది. మీ అందరికీ ధన్యవాదాలు. ఇదంతా చూస్తుంటే మేము ట్రైలర్‌ను విడుదల చేసినట్లుగా అన్పిస్తోంది. నాపై చాలామంది ప్రశంసలు కురిపిస్తున్నారు. కానీ వాస్తవానికి నేను షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్‌ పనులతో బిజీగా ఉన్నాను. టీం అంతా దీనికోసం 2 నెలలు కష్టపడ్డారు. ఆ ప్రశంసలు వారికే దక్కాలి. ఆకర్షణీయమైన సంగీతం, ర్యాప్ ఇచ్చినందుకు అచ్చు రాజమణి, బ్లాజి, ఆదిత్య అయ్యంగార్ లకు ధన్యవాదాలు. మేకింగ్ వీడియోను అన్ని కోణాల నుంచి అద్భుతంగా తీసినందుకు శ్రీనివాస్ గాదె కు థాంక్స్” రాజమౌలిని తన ట్విట్టర్ లో పోస్ట్ చేశారు. ఇక జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్, అలియా భట్, ఒలివియా మోరిస్, సముతిరకని, శ్రియ శరణ్, అజయ్ దేవ్‌గన్ తదితరులు ఈ చిత్రంలో భాగం. “ఆర్‌ఆర్‌ఆర్” 2021 అక్టోబర్ 13న తెరపైకి రానుంది.

-Advertisement-

Related Articles

- Advertisement -

Latest Articles

-Advertisement-